కెటిఆర్ కు నేరెళ్ల గుబులు

First Published Aug 8, 2017, 4:51 PM IST
Highlights
  • ఢిల్లీకి చేరిన నేరెళ్ల ఆక్రంధన
  • విపక్షాల మాటలు పెడచెవిన పెట్టిన సర్కారు
  • స్పందించిన జాతీయ మానవహక్కుల కమిషన్
  • మీడియాకు దూరంగా కెటిఆర్ పరామర్శ
  • వేములవాడ ఆసుపత్రిలో రోగుల పరామర్శ
  • ఆందోళనలో తెలంగాణ సర్కారు

తెలంగాణ సిఎం తనయుడు, మంత్రి కెటిఆర్ కు నేరెళ్ల గుబులు పుట్టుకుంది. నేరెళ్లలో పోలీసులు చెలరేగిపోయి అక్కడి దళితులను, యాదవులను, బుడగజంగాల వారిని చితకబాదిర్రు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిర్రు. బొక్కలు చూర చూర చేసి ఇరగగొట్టిర్రు పోలీసులు. దీనికి కారణం ఏంటంటే అక్కడ తిరిగే ఇసుక లారీలను వీళ్లు కాలబెట్టిర్రట. ఎందుకంటే ఇసుక లారీలు జనాలను తొక్కిచ్చి చంపుతున్నాయన్న కోపంతో వాళ్లు లారీలు కాబెట్టిర్రు. పది మంది వరకు ఇసుక లారీలు బలి తీసుకున్నాయి. ఇసుక లారీలను కాలబెట్టడం పట్ల సర్కారు పెద్దలకు కోపం కలిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగిర్రు.

ఇక నేరెళ్ల బాధితుల వ్యవహారం తాజాగా ఢిల్లీకి చేరింది. కేంద్ర మానవ హక్కుల కమిషన్ కు, ఎస్సీ కమిషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నేరెళ్ల లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపుతానని మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ రంగంలోకి దిగిర్రు. నేరెళ్ల చేజారిపోతుందన్న భయంతో ఆయన హడావిడి మొదలు పెట్టిర్రు. రహస్యంగా వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మీడియాను దూరంగా ఉంచి తన పరామర్శల పర్యటన చేశారు కెటిఆర్.

వేములవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నేరెళ్ళ బాధితులను మంగళవారం కెటిఆర్ పరామర్శించారు. అది కూడా మీడియా లేకుండానే పరామర్శ కు వెళ్లారు కెటిఆర్. ఎందుకంత రహస్యంగా పర్యటించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నేరెళ్ల సంఘటన జరిగి మూడు వారాలు గడుస్తున్నది. అక్కడ ఇసుక లారీలు జనాలను తొక్కిచ్చి సంపుతున్నాయి. ఇప్పటికే పది మందికిపైగా జనాలు ఇసుక లారీల వేగానికి బలైపోయారు. లారీలు తొక్కిచ్చి సంపుతుంటే కొందరు యువకులు తెలిసి తెలియక కొన్ని ఇసుక లారీలను కాలబెట్టిర్రు. దీంతో కొందరిని టార్గెట్ చేసి సిరిసిల్ల పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిర్రు. బాధితులు చాలా మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నరు.

ఆ ఇసుక లారీలు సిఎం బంధువులవే అన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, లెఫ్ట్ పార్టీలతోపాటు జెఎసి, మావోయిస్టు పార్టీలన్నీ మూకుమ్మడిగా ఆ ఇసుక మాఫియా నడిపేది కెటిఆర్ అని, కెసిఆర్ కుటంబమే మాఫియా నడుపుతున్నదని ఆరోపించారు. కెటిఆర్ ఇసుక మాఫియా డాన్ అని కూడా కొందరు అభివర్ణించారు. తక్షణమే ఆ పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు.

ఇక ఇంత జరిగితే మంత్రి కెటిఆర్ అందరూ వెళ్లి పరామర్శించిన తర్వాత విపక్షాలన్నీ సర్కారుపై విమ్శలు గుప్పించిన తర్వాత తాపీగా వెళ్లారు. అది కూడా నేరెళ్ల కాకుండా వేములవాడ ఆసుపత్రిలో బాధితులను సీక్రెట్ గా వెళ్లి పరామర్శించారు. కెమెరాలను రానీయలేదు. మీడియాను దూరంగా ఉంచారు. ఎందుకంత రహస్యంగా పరామర్శించారన్నది తేలాల్సి ఉంది. పరామర్శ ముగిసిన తర్వాత మీడియాకు ఒక ప్రకటన చేశారు కెటిఆర్. తర్వాత మీడియా పట్ల తమకు గౌరవం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకూ మీడియా అంటే గౌరవం ఉందా? లేక మీడియాలో బాధితుల ఆక్రంధనలు, వారి బాధలు బయటపడతాయన్న భయంతోనే దూరంగా పెట్టారా అన్న చర్చ సాగుతున్నది.

click me!