ఓ యువకుడు స్నేహితులకు వీడియోకాల్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దృశ్యాలను తన మిత్రులకు వీడియో కాల్ ద్వారా చూపిస్తూ మరీ ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాదులోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఈ మేరకు తెలియజేశారు.. టి సాంబరాజు (22) అనే యువకుడు రామంతపూర్ గోకలేనగర్ నివాసి. సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్నాడు.
రోజూ పనికి వెళ్లేలాగే ఆరోజు కూడా ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాడు. షాప్ కు వెళ్తున్నానని చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరిన సాంబరాజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బేగంపేట్ లోని హోటల్లో దిగాడు. అక్కడ ఓ గదిని అద్దెకి తీసుకున్నాడు. ఆ గదిలోని ఫ్యాన్ కి తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
undefined
పెళ్లి బారాత్ లో విషాదం... వధూవరులతో కారులో వెళుతున్న చిన్నారి దుర్మరణం
ఉరి వేసుకోవడానికి ముందు మిత్రులకు వీడియో కాల్ చేసి.. తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పాడు. అంతే కాదు తాను ఎలా ఉరి వేసుకుంటున్నది మిత్రులకు చూపిస్తూ మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసిన మిత్రులు తీవ్రంగా కలవరపాటుకు గురయ్యారు. వెంటనే అలర్టైన స్నేహితులు అతడిని రక్షించడానికి తమ ఫోన్లోని లొకేషన్ ఆధారంగా.. సాంబరాజు ఉన్న హోటల్ ప్రాంతాన్నిగుర్తించారు.
వెంటనే అక్కడికి చేరుకుని.. విషయాన్ని వివరించారు. వారి సహాయంతో సాంబరాజు ఉన్నగది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సాంబరాజు ఉరి వేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. అది చూసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హోటల్ యాజమాన్యం వెంటనే బేగంపేట పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. సాంబరాజును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే, సాంబరాజు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం ఇంట్లో నుంచి అతి మామూలుగా బయలుదేరిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా కనిపించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే,ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.