సినీ నటి డింపుల్ హయతిపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది.
హైదరాబాద్: సినీ నటి డింపుల్ హయతితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. హైద్రాబాద్ జర్నలిస్టు కాలనీలోని అపార్ట్ మెంట్ లో సినీ నటి డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఎదురు ఎదురు ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు రెండు రోజుల క్రితం ట్రాపిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుకు సినీ నటి డింపుల్ హయతి కారు డ్యాష్ ఇచ్చింది. ఈ విషయమై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ హైద్రాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విషయమై మంగళవారంనాడు తన నివాసం వద్ద ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మీడియాతో మాట్లాడారు. పార్కింగ్ ప్లేస్ లో కార్ల పార్కింగ్ విషయమై గొడవ జరిగిందన్నారు. తాను ఎప్పుడంటే అప్పుడు విధులకు హాజరయ్యేందుకు వీలుగా పార్కింగ్ ప్లేస్ లో కారు అడ్డుగా పెట్టవద్దని కోరినా కూడా డింపుల్ హయతి పట్టించుకోవడం లేదని డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. గతంలో కూడా ఈ విషయమై తాను హయతిని రిక్వెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తాను కూడా ఇక్కడికి కొత్తగా వచ్చినట్టుగా ఆయన చెప్పారు. కారు పార్కింగ్ విషయంలో సహకరించాలని కోరినా కూడా పట్టించుకోలేదన్నారు. గతంలో రంజాన్ సమయంలో తాను అర్జంట్ గా బయటకు వెళ్లాల్సిన సమయంలో తన కారుకు అడ్డుగా కారును నిలిపి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
also read:హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
డింపుల్ హయతి కారుపై చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగమేనని చెప్పారు. హయతి కారుపై చలాన్లు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. పార్కింగ్ ప్లేస్ లో ఏం జరిగిందనే దానిపై సివిల్ పోలీసులు తేలుస్తారన్నారు