Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్‌ కొడుకు.. ఆ త‌ర్వాత ఏం జ‌గిందంటే?

By Mahesh Rajamoni  |  First Published Dec 12, 2021, 11:21 AM IST

Hyderabad:  మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఓ మ‌హిళ స్నానం చేస్తుండ‌గా, ఆ దృశ్యాలు త‌న మొబైల్‌లో వీడియో తీశాడు ఓ ప్ర‌బుద్దుడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. 


Hyderabad: ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా, ఎలాంటి శిక్ష‌లు విధిస్తున్నప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దాడులు, అఘాయిత్యాలు, వేధింపుల‌కు గురిచేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలోనే ఓ మ‌హిళ స్తానం చేస్తుండ‌గా.. ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో స్నానం చేస్తున్న దృశ్యాల‌ను వీడియో తీశాడు. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రా ప్ర‌కారం.. హైద‌రాబాద్‌లోని ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో ఓ మ‌హిళా త‌న కుటుంబంతో క‌లిసి ఓ అద్దే భ‌వ‌నంలో నివాసం ఉంటున్నారు. ఇక బాధిత మ‌హిళ (35) బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఇంటి యజమాని కొడుకు దిలీప్ త‌న సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నట్లు ఆమె గమనించింది. దీని గురించి  వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియ‌జేసింది. 

Also Read: black magic: కండ్ల‌ల్లో నిమ్మ‌ర‌సం కొడుతూ క్షుద్ర‌పూజలు.. బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో దొంగ స్వామీజీ బాగోతం

Latest Videos

 

ఇంటి య‌జ‌మాని కొడుకు.. మ‌హిళ స్నానం చేస్తుండ‌గా వీడియో తీసిన ఘ‌ట‌న గురించి ఇంటి య‌జ‌మానికి బాధిత కుటుంబ స‌భ్యులు తెలియ‌జేశారు. అయితే, త‌న కుమారుడు అలాంటివాడు కాదంటూ పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తూ.. త‌న కొడుకును  వెన‌కేసుకొచ్చాడు. దీంతో మ‌హిళ భ‌ర్త పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు న‌మోదుచేసుకున్నారు.  నిందితుడు దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని విచారించ‌గా విస్తూపోయే విష‌యాలు వెలుగుచూశాయి. గ‌త మూడు నెల‌ల నుంచి స‌ద‌రు బాధిత మ‌హిళ స్నానం చేస్తుండ‌గా.. ఆ దృశ్యాల‌ను త‌న మొబైల్ తో వీడియో తీసిన‌ట్టు నిందితుడు దిలీప్ వెల్ల‌డించారు. పోలీసులు ఇక్క‌డే కాకుండా మ‌రెక్క‌డైనా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడ అనేదాని గురించి కూడా నిందితుడిని విచారిస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో పవన్ ఎలాంటి లేఖ రాయ‌లేదు !

ఇదిలావుండ‌గా, ఇటీవ‌లే హైదార‌బాద్‌లోని బంజారాహిల్స్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా కేబుల్‌ టెక్నిషియన్‌ వీడియో తీసి అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ  ఘటనను మరవక‌ముందే న‌గ‌రంలో ఇదే త‌ర‌హాలో ఫిల్మ్ న‌గ‌ర్ ఘ‌ట‌న వెలుగుచూడ‌టం మ‌హిళ‌ల ర‌క్ష‌ణ ప్ర‌మాదంలో ప‌డుతున్న‌ద‌ని తెలియ‌జేస్తున్న‌ది. 

Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో పవన్ ఎలాంటి లేఖ రాయ‌లేదు !

click me!