Latest Videos

మహిళా సర్వేయర్‌ పట్ల అనుచిత ప్రవర్తన: గుండాల తహసీల్దార్ దయాకర్‌ రెడ్డిపై వేటు

By narsimha lodeFirst Published Dec 12, 2021, 10:18 AM IST
Highlights


గుండాల తహసీల్దార్  దయాకర్ రెడ్డిపై వేటు పడింది. మహిళా ఉద్యోగినిపై అనుచింగా వ్యవహరించినందుకు తహసీల్దార్ దయాకర్ రెడ్డిపై వేటు పడింది. ఈ నెల 8వ తేదీన బాధితురాలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా గుండాల తహసీల్దార్ పై వేటు పడింది.
 

భువనగిరి: మహిళా సర్వేయర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన Gundala Tahsildar దయాకర్ రెడ్డిపై వేటు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్Dayakar Reddy పై మహిళా సర్వేయర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి  వేటు వేసింది. గుండాల తహసీల్దార్ దయాకర్ రెడ్డిని CCLAకి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మద్యం మత్తులో గుండాల తహసీల్దార్ దయాకర్ రెడ్డి అనుచితంగా వ్యవహరించాడని ఆమె జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు.

పనులు పెండింగ్ లో లేకకున్నా రాత్రి, పగలు అనే తేడా లేకుండా మూడు నాలుగు నెలల నుండి తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని కూడా  ఆమె కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నెలల తరబడి ఈ వేధింపులు భరించానని ఇక తాను ఈ వేధింపులను భరించే పరిస్థితి లేకపోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలు తెలిపారు. బాధితురాలు ఈ నెల 8వ తేదీన కలెక్టర్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ వెంటనే గుండాల తహసీల్దార్ పై చర్యలు తీసుకొన్నారు.  గుండాల తహసీల్దార్  దయాకర్ రెడ్డిని సీసీఎల్ ఏకి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

click me!