హైద్రాబాద్‌లో మహిళా టెక్కీ మిస్సింగ్: పోలీసుల గాలింపు

By narsimha lodeFirst Published Nov 12, 2021, 2:53 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో మహిళా టెక్కీ భార్గవి మిస్సింగ్ చోటు చేసుకొంది. బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లింది. ఇంతవరకు ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో మహిళా టెక్కీ భార్గవి బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి ఇంటినుండి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె నగరంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం నాడు సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బ్యూటీపార్లర్ వద్దకు వెళ్లినా కూడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తెలిసిన వారికి ఫోన్ చేసిన భార్గవి గురించి కుటుంబసభ్యులు విచారించారు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  Hyderabad నగరంలో ఆమె నడుచుకొంటూ తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.పంజాగుట్ట నుంచి మలక్‌పేట వరకు వెళ్లింది. తన దగ్గర ఉన్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ముసారాంబాగ్ వద్ద రోడ్డుపై  Bhargavi పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

also read:పంజాగుట్ట చిన్నారి హత్య కేసు: ఇద్దరి అరెస్ట్

భార్గవికి ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు. భార్గవిది చిత్తూరు జిల్లా. ఆమె భర్తది కూడా చిత్తూరు జిల్లాగా police గుర్తించారు. ఇటీవల కాలంలో ఇంట్లో స్వల్ప గొడవలు జరుగుతున్నాయని సమాచారం.  భార్గవి భర్త కూడా Techie   గా పనిచేస్తున్నారు. అయితే  ఆమె ఎందుకు ఇంటి నుండి వెళ్లిపోయిందనే విషయమై తనకు అర్ధం కావడం లేదని భర్త చెబుతున్నారు. హైద్రాబాద్ లోనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆయన పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మహిళా టెక్కీ  భార్గవి ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్గవి కుటుంబసభ్యుల నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. భార్గవి  ఇంటి నుండి వెళ్లాల్సిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై భార్గవి పేరేంట్స్ తో పాటు భర్తను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పంజాగుట్ట సెంట్రల్ వద్ద  భార్గవి  బస్సు ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ ఎందుకో బస్సు ఎక్కలేదు. ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లింది. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్దకు రైలు ఎక్కకుండా పంజాగుట్టకు ఆమె వచ్చింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు.హైద్రాబాద్ పోలీసులు గతంలో కూడా మిస్సింగ్ కేసులను శాస్త్రీయమైన ఆధారాలతో చేధించారు. అయితే  భార్గవి మూసారాంబాగ్ వద్ద ఫోన్ ను పారేసినట్టుగా గుర్తించారు. తన ఆచూకీ లభ్యం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె ఫోన్ ను పారేసిందా  లేదా పొరపాటున ఫోన్ పోగోట్టుకుందా అనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు.

click me!