TRS Dharna: ఏదైనా కోపముంటే మాపై చూపించండి... మా రైతులపై కాదు.: బిజెపి సర్కార్ కు గంగుల హెచ్చరిక (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 12, 2021, 2:46 PM IST
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పక్షాన నిలబడి కేంద్రంలోని బిజెపితో పోరాటానికి సిద్దమయ్యిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కోన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన టీఆర్ఎస్ ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. 

కరీంనగర్: తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా చేపట్టింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో మంత్రితో పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావు, జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా minister gangula kamalakar మాట్లాడుతూ... తెలంగాణ పచ్చగా ఉండడాన్ని కేంద్రంలోని BJP పాలకులు చూడలేక పోతున్నారని అన్నారు. అధికారంలో ఉన్న TRS Party ని రోడ్లపైకి తీసుకువచ్చారని గంగుల ఆవేదన వ్యక్తం చేసారు. 

వీడియో

''స్వయం పాలనలో రైతుల సంక్షేమం కోసం CM KCR అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఇప్పుడుప్పుడే రైతులు తెరిపిన పడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది'' అన్నారు. 

''రాజ్యాంగంలో వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల చేతుల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. మద్దతు ధరతో పాటు ధాన్యం కొనుగోలు, వాటిని నిల్వ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలం రైతుల వ్యవసాయానికి కావల్సిన సాగునీరు, విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు లాంటి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత'' అని వివరించారు. 

read more  TRS Dharna: ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..: మంత్రి హరీష్ ఆగ్రహం

''కాళేశ్వరం జలాల రాక, 24 గంటల కరెంట్, రైతు పెట్టుబడి, కావలసినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి బీడు భూములు లేకుండా పోయాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో దిగుబడి కూడా పెరిగింది'' అని తెలిపారు. 

''తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఢిల్లీకి పంపిస్తున్నాం. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దనుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రాజ్యాంగం హక్కును కల్పించింది.  ప్రతి ధాన్యం గింజను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు యాసంగి పంటను కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది'' అని పేర్కొన్నారు. 

'ధాన్యం కొనుగోలుపై మంత్రి కేటిఆర్ తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశాం. రైతులకు షరతులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశాం.  కానీ వానాకాలం పంటను కొనుగోలు చేస్తామని... యాసంగి పంటను కొనుగోలు చేయమని చెబుతుంది. దీనిపై సిఎం కెసిఆర్ సైతం కేంద్ర ప్రభుత్వంతో చర్చించినా వారి నుండి స్పందన లేకుండా పోయింది. ఏదైనా కోపముంటే మాపై చూపించండి... రైతుల పై కాదు'' అని గంగల పేర్కోన్నారు. 

read more  TRS Dharna: బిజెపి సర్కార్ తో ఇక యుద్దమే... రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు (వీడియో)

''పంజాబ్ లో పండిన ప్రతిధాన్యం గింజను కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదు. తెలంగాణ రైతులు భారతీయులు కాదా?  రైతులు ఎడిస్తే దేశం బాగుపడదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మళ్ళీ బీడు భూములు పెరిగే ప్రమాదముంది'' అని గంగుల ఆందోళన వ్యక్తం చేసారు.

''తెలంగాణ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే వరకు రైతు పక్షాన నిలబడుతాం. బేషరతుగా తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాల్సిందే'' అని డిమాండ్ చేసారు. 

''సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆస్థి. బడుగు, బలహీన వర్గాలు రైతాంగం కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి ఉత్తర్వులు రావాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతాం... బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇళ్ళను ముట్టడించి ధర్నా చేస్తాం'' అని మంత్రి గంగుల హెచ్చరించారు.

click me!