Mariamma Lockup Death : బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు? హై కోర్ట్ సీరియస్..

By AN TeluguFirst Published Nov 12, 2021, 2:33 PM IST
Highlights

లాకప్ డెత్ బాధ్యులపై  క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని తెలంగాణ హైకోర్అటు ధికారులను ప్రశ్నించింది.  బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తొలగిస్తే న్యాయం  చేసినట్టేనా? అని తీవ్రంగా స్పందించింది.

హైదరాబాద్ :  Mariamma Lockup Death పై తెలంగాణ హై కోర్టు మరోసారి సీరియస్గా స్పందించింది బాధితులకు పరిహారం చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాకప్ డెత్ బాధ్యులపై  క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించింది.  బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తొలగిస్తే న్యాయం  చేసినట్టేనా? అని తీవ్రంగా స్పందించింది.

ఈ ఏడాది జూన్ లో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో దొంగతనం ఆరోపణలతో మరియమ్మను ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ li అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేయలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు.  ఆ తర్వాత వారిని తీవ్రంగా కొట్టారు. కాగా,  ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ దెబ్బలకు తాళలేక మరియమ్మ జైలులోనే మృతి చెందింది.  దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ఈ క్రమంలో సీఎం KCRప్రత్యేక విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే  ఎస్ ఐ  మహేష్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను  అధికారులు విధుల నుంచి తొలగించారు. తాజాగా పౌరహక్కుల సంఘాలు ఈ సంఘటన హై కోర్టుకు వెళ్లాయి. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తాజాగా సిబిఐ విచారణకు ఆదేశించింది.

కాగా, 2021 జూన్ 16న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడానికి చెందిన మ‌రియ‌మ్మ‌, ఆమె కుమారుడు ఉద‌య్ కిర‌ణ్ ను  భువ‌న‌గిరి జిల్లా అడ్డ‌గూడూరుకు చెందిన పోలీసులు పిక‌ప్ చేసుకునివెళ్లి.. అడ్డ‌గూడూరు స్టేష‌న్ లో గొడ్డునుబాదిన‌ట్టు బాదారు. నాలుగు రోజులపాటు కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు.

మరియమ్మ లాకప్ డెత్: మల్లు భట్టి విక్రమార్క పోరుకు మాణిక్యం ఠాగూర్ ఫిదా

తరువాత జూన్ 17న మ‌ళ్లీ మ‌రియ‌మ్మ‌ను చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడెం తీసుకువ‌చ్చి గ్రామ‌స్థులంతా చూస్తుండ‌గా.. చింతకానీ పోలీస్ స్టేషన్ లో వదిలేస్తామని చెప్పి, చింతకానీ కాకుండా కొనిజర్ల తీసుకువెళ్లి.. కుమార్తె ముందే మరియమ్మును శారీరకంగా హీంసించారు. 

అక్కడ నుంచి రాత్రి 10.30 ప్రాంతంలో చింతకానీ స్టేషన్ కు తీసుకువచ్చి, చంటిబిడ్డతో ఉన్న కుమార్తె ముందు రాత్రంతా పైన గదిలో నలుగురు కానిస్టేబుల్స్ (మహిళా కానిస్టేబుల్ లేకుండా) ఒకరి తరువాత ఒకరు ఒళ్ళు హూనం అయ్యేట్లు లాఠీలతో కొట్టారు.  దెబ్బలకు తాళలేక మరియమ్మ అరుస్తున్న అరుపులు వినే నాథుడే లేడు.

మరియమ్మ లాకప్ డెత్ : కేసీఆర్ నీకు బుద్దుంటే, నువ్వు మనిషివైతే చంపిన వారిమీద చర్యలు తీసుకో.. భట్టి విక్రమార్క

చివరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో మరియమ్మను చింతకానీ నుంచి అడ్డగూడూరు స్టేషన్ కు తరలించి అక్కడ కూడా విపరీతంగా కొడితే.. దెబ్బలు భరించలేక మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చేతుల్లో పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు విడిచింది. దీనిమీద కుమారుడు ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ‘ నా చేతుల్లోనే మా అమ్మ చనిపోయింది’ అంటూ హృదయవిదారకంగా రోధించాడు.  

దీనిమీద ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మానవహక్కులు, పౌరహక్కులు నాశనం అవుతున్నాయనంటూ మండిపడ్డాయి. 

click me!