హైదరాబాద్ లో దారుణం.. భర్తకు మద్యం తాగించి, భార్యమీద హత్యాచారం..

By AN TeluguFirst Published Nov 23, 2021, 3:13 PM IST
Highlights

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు గ్రామస్తులు పాశవికంగా అత్యాచారం చేశారు. తరువాత ఆమెను దారుణంగా హత్య చేశారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడే ముందు ఆమె భర్తకు మద్యం తాగించి.. భార్యపై ఈ దారుణానికి పాల్పడ్డారు. 

అబ్దుల్లాపూర్ మెట్ : హైదరాబాద్ లో రోజురోజుకూ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దిశ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రభుత్వం ఎన్ని కఠిన శిక్షలు విధించినా మహిళల మీద అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అలాంటి ఓ దారుణమే తాజాగా హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ శివారు Abdullapur Met మండలం తారామతిపేట్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు గ్రామస్తులు పాశవికంగా rape చేశారు. తరువాత ఆమెను దారుణంగా murder చేశారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడే ముందు ఆమె భర్తకు మద్యం తాగించి.. భార్యపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితులను సురేశ్, శ్రీకాంత్ గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు policeల అదుపులో ఉండగా.. మరొకరి పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

బీజేపీ కార్పొరేటర్ల మెరుపు నిరసన... జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఇదిలా ఉండగా, తమిళనాడులో పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్ల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. covid-19 సమయంలో చాలా మంది వైద్యులు స్టార్ హోటల్ లో 15 రోజుల Quarantine గడిపారు. 

గత AnnaDMK ప్రభుత్వ హయాంలో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటటీ ఆస్పత్రికి చెందిన ఇద్దరు lady doctors చెన్నై టీ నగర్ లోని ఒక స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. అదే hotel లో క్వారంటైన్ లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్ రాజ్ (28) అనే ఇద్దరు డాక్టర్లు.. ఆ మహిళా వైద్యురాళ్ల గదిలోకి ప్రవేశించారు. వారిని అరిస్తే చంపుతానని బెదిరించి.. వారిమీద rape attemptకి పాల్పడ్డారు. 

Venkata Rami Reddy: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం.. హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్

అంతటితో ఆగలేదు. ఆ లైంగిక దాడిని వీడియో తీశారు. అది చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ పులమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఆ sexual harrassements ఆగకపోతుండడంతో.. చివరికి వారు తట్టుకోలేకపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని ప్రభుత్వాధికారులు షాక్ అయ్యారు. ఆ తరువాత దీనిమీద దర్యాప్తుకు ఆదేశించారు. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నగర పోలీస్ కమీషనర్ శంకర్ జివాల్.. Chennai తేనాంపేట మహిళా పోలీసులతో విచారణ జరిపించారు. ప్రాథమికంగా నేరం నిర్థారణ కావడంతో వైద్యులు వెట్రిసెల్వన్, మోహన్ రాజ్ లను గురువారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా Department of Health and Welfare శుక్రవారం డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేసింది. 

click me!