బీజేపీ కార్పొరేటర్ల మెరుపు నిరసన... జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Arun Kumar P   | Asianet News
Published : Nov 23, 2021, 02:02 PM ISTUpdated : Nov 23, 2021, 02:12 PM IST
బీజేపీ కార్పొరేటర్ల మెరుపు నిరసన... జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సారాంశం

బిజెపి కార్పోరేటర్ల మెరుపు నిరసనతో హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. 

హైదరాబాద్: బిజెపి కార్పోరేటర్ల మెరుపు నిరసనతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు మేయర్ ఛాంబర్ లోకి దుసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని కార్యాలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, BJP Carporators కు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

GHMC జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగినట్లు  బిజెపి కార్పోరేటర్లు తెలిపారు. ఐదు నెలల క్రితం కరోనా కారణంగా పర్చువల్ గా నామమాత్రంగా మీటింగ్ జరిగిందని... ఆ మీటింగ్ లో చర్చించిన ఒక్క సమస్యకూడా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని తాము కోరుతుంటే ఎక్కడ తమ అవకతవకలు బయటపడతాయోనని భయపడే మేయర్, టీఆర్ఎస్ కార్పోరేటర్లు వెనకడుగు వేస్తున్నారని బిజెపి కార్పోరేటర్లు ఆరోపించారు.

మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరప్రజల సమస్యలను పట్టించేకోవడం లేదని బిజెపి కార్పోరేటర్లు ఆరోపిస్తున్నారు. Hyderabad mayor gadwala vijayalakshmi కి వ్యతిరేకంగా బిజెపి కార్పోరేటర్లు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆమె కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బిజెపి కార్పోరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది.

read more  రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా? 

hyderabad నగరంలో ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేయడంలేడని... దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కార్పోరేటర్లు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్యలు తీసుకుని పరిష్కరించడంతో పాటు కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని బిజెపి కార్పోరేటర్లు జిహెచ్ఎంసి పాలకవర్గాన్ని హెచ్చరించారు. 

read more  Venkata Rami Reddy: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తాం.. హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్

గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుని అంచనాలకు మించిన ప్రదర్శనతో అత్యధిక డివిజన్లను గెలుచుకుంది. దుబ్బాక ఉపఎన్నిక విజయం ఇచ్చిన ఊపుతో బిజెపి శ్రేణులు ఉత్సాహంతో పనిచేసి మంచి ఫలితాన్ని రాబట్టారు. 150 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 55 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా, 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించాయి. ఆ తర్వాత బిజెపి సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు పరిమితమైంది.

గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు భారీగా సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంది. దీంతో జిహెచ్ఎంసీపై మరింత పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బిజెపి  మేయర్ విజయలక్ష్మితో పాటు టీఆర్ఎస్ కార్పోరేటర్లను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బిజెపి కార్పోరేటర్లతో ఆందోళన చేయించింది.  
 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్