Green India Challenge: హైదరాబాద్ శివారులో మొక్కలునాటిన రవిశంకర్ గురూజి

By Arun Kumar PFirst Published Nov 23, 2021, 2:37 PM IST
Highlights

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి ఉసిరి మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

హైదరాబాద్: తెలంగాణలో మహోధ్యమం సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు విచ్చేసిన ఆయన శివారుప్రాంతమైన శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కను నాటారు. 

ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ... మొక్కలను నాటడమనే మహోన్నతమైన కార్యం green india challenge కు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టడం మంచి విషయమన్నారు. భవిష్యత్ తరాలకోసం చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాలనే ఆయన ఆలోచన అద్భుతమంటూ TRS MP Santosh Kumar  ను ravishankar కొనియాడారు. 

చెట్లలో రెండు రకాలు వుంటాయని... పండ్లు ఫలాలను ఇచ్చేవి కొన్నయితే ఏపుగా పెరిగి నీడనివ్వడం, ప్రజా అవసరాల కోసం ఉపయోగపడేవి మరికొన్ని వుంటాయన్నారు.  ఈ రెండురకాలు మానవాళికి ఉపయోగపడేవే. అలాంటి ఉపయోగకరమైన మొక్కలను నాటాల్సిన అవసరం ఎంతయినా వుందని గుర్తించే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారని పేర్కొన్నాకె. ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకువెళుతున్న ప్రతినిధులను రవిశంకర్ ప్రశంసించారు. 

read more  రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా?

ఈ సందర్భంగా వృక్షాలకు భారతీయ సంస్కృతిలో ఎంతటి ప్రాధాన్యత వుందో తెలియజేస్తూ వాటి గొప్పతనాన్ని తెలియజేసే ''వృక్షవేదం'' పుస్తకం గురించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ రవిశంకర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు, మల్లికార్జున్ రెడ్డి,  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యులు రాఘవతో పాటు ఆశ్రమ బాధ్యులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు ఆద్యాత్మికవేత్తలు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. పలువురు కేంద్ర మంత్రులు, శశి థరూర్ వంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

read more  Green India Challenge: మొక్కకు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్.. ఎమోషనల్ కామెంట్స్

ఇక అత్యధికంగా సినీ ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, సీనియర్, జూనియర్ నటీనటులు ఇలా అందరూ ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవ్ గణ్ వంటి వారు కూడా మొక్కలు నాటారు. 

క్రీడాప్రముఖులు సైతం ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, హైదరబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, సైనా నెహ్వాల్, ఇలా చాలామంది ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.  

click me!