పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

Published : Dec 23, 2018, 01:38 PM ISTUpdated : Dec 23, 2018, 04:54 PM IST
పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

సారాంశం

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకొంది.  ప్రేమ వివాహం చేసుకొందని కూతురిని చంపి మృతదేహన్ని దగ్దం చేశారు కుటుంబ సభ్యులు.  


మంచిర్యాల:మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకొంది.  ప్రేమ వివాహం చేసుకొందని కూతురిని చంపి మృతదేహన్ని దగ్దం చేశారు కుటుంబ సభ్యులు.

జన్నారం  మండలం కలమడుగులో  ఓ కుటుంబం దారుణానికి పాల్పడింది. తన కూతురు ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేక కూతుర్ని హత్య చేసి మృతదేహన్ని దగ్దం చేశారు. మృతదేహం ఆనవాళ్లు కన్పించకుండా ఉండేందుకు వీలుగా బూడిదను నీళ్లలో కలిపారు.


కలమడుగుకు చెందిన అనురాధ, లక్ష్మణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ జంట పెద్దలను ఎదిరించి ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నారు. అనురాధ కుటుంబం కంటే లక్ష్మణ్ తక్కువ కులానికి చెందినవాడని భావిస్తున్నారు.

వివాహం జరిగినప్పటి నుంచి అనురాధ కుటుంబసభ్యులు కొద్దిరోజులుగా భార్యాభర్తలను వెంబడిస్తున్నారు. ప్రేమ వివాహం సహించని తల్లిదండ్రులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని అనురాధపై పగ పెంచుకున్నారు.

నాలుగు రోజుల క్రితం నూతన దంపతులు కలమడుగుకు చేరుకున్నారు. వరుడు ఇంటికి వచ్చిన అనురాధను ఆమె తల్లిదండ్రులు శనివారం ఇంటికి పిలిపించుకున్నారు. నిన్న రాత్రంతా ఆమెను కుటుంబసభ్యులు చితకబాదారు. కుటుంబసభ్యులకు గ్రామస్తులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. 

మృతురాలి  తండ్రి సత్తయ్య, సోదరుడు మహేష్ అనురాధ చితకబాదినట్లు స్ధానికులు చెబుతున్నారు. దెబ్బలు తాకలేక అనురాధ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె శవాన్ని తమ స్వంత పొలంలో సజీవ దహనం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

 

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu