హైదరాబాద్ లో భారీ వర్షాలు : హుస్సేన్ సాగర్ నాలాలో పడి మహిళ గల్లంతు...

By SumaBala Bukka  |  First Published Sep 4, 2023, 1:24 PM IST

హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓ మహిళ నాలాలో పడి గల్లంతయ్యింది.  గాంధీనగర్ లో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. 


హైదరాబాద్ : హైదరాబాద్ లోని గాంధీనగర్ లో విషాద ఘటన వెలుగు చూసింది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి లక్ష్మీ అని మహిళ గల్లంతయ్యింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ లో ఉండే లక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ నాలాపై ఇల్లు నిర్మించుకుంది. ఇటీవల వర్షానికి ఇంటి గోడ కూలింది. ఈ రోజు ఉదయం నుంచి లక్ష్మి కనిపించకుండా పోయింది.

నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆదివారం మద్యాహ్నం రెండు గంటల నుంచి లక్మ్షి ఆచూకీ కనిపించడం లేదు. నాలా దగ్గర లక్ష్మి చేతి గాజులు కనిపించాయి. ఆమె కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించారు.

Latest Videos

హైద్రాబాద్‌లో భారీ వర్షం: రోడ్లపై నిలిచిన వర్షం నీరు, ట్రాఫిక్ జామ్

దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ మేరకు స్థానికులు వివరాలు తెలియజేశారు. నాలాలోపడి గల్లంతయినట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!