వెంకటేశ్వర హేచరీస్ కు ఈడీ షాక్: రూ. 65 కోట్ల ఆస్తులు సీజ్

Published : Sep 04, 2023, 12:27 PM ISTUpdated : Sep 04, 2023, 01:08 PM IST
 వెంకటేశ్వర హేచరీస్ కు ఈడీ షాక్: రూ. 65 కోట్ల ఆస్తులు సీజ్

సారాంశం

వెంకటేశ్వర హేచరీస్ కు చెందిన  రూ. 65 కోట్ల ఆస్తులను  ఈడీ  అటాచ్ చేసింది.  యూకేలో  ఈ సంస్థ భారీగా  ఆస్తులు కూడబెట్టిందని  ఈడీ ఆరోపిస్తుంది.

హైదరాబాద్: వెంకటేశ్వర హేచరీస్  కు చెందిన రూ. 65 కోట్ల ఆస్తులను  ఈడీ అటాచ్ చేసింది.  ఫెమా చట్టం ఉల్లంఘించినట్టుగా  వెంకటేశ్వర హేచరీస్ సంస్థపై  ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న  వెంకటేశ్వర హేచరీస్ సంస్థకు  చెందిన ఆస్తులను  ఈడీ అదికారులు ఆటాచ్ చేశారు.  యూకేలో  ఈ సంస్థ భారీగా ఆస్తులను  కూడబెట్టిందని  ఈడీ అధికారులు  గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

యూకేలో  వెంకీస్ ఓవర్సీస్  లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసింది  వెంకటేశ్వర హెచరీస్ సంస్థ.యూకేలో  అలెగ్జాండర్  హౌజ్ పేరుతో 90 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది వెంకటేశ్వర హేచరీస్ సంస్థ. యూకేలోని బ్యాంకులో  రుణం తీసుకొని ఈ భూమిని కొనుగోలు చేసింది ఈ సంస్థ.వెంకటేశ్వర హేచరీస్ సంస్థ డైరెక్టర్ల కోసం ఈ భూమిని కొనుగోలు చేసినట్టుగా  ఈడీ గుర్తించిందని  మీడియా రిపోర్టు చేసింది.రూ. 65.5 కోట్లను వీవోఎల్ కు మళ్లించిందని ఈడీ గుర్తించింది. ఈ నిధులను  యూకేలోని బ్యాంకు రుణాన్ని వీవోఎల్ తీర్చింది.ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఈడీ తేల్చింది.ఈ మేరకు  ఈ సంస్థకు చెందిన మహారాష్ట్ర,కర్ణాటకల్లోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??