తెలంగాణ బీజేపీలో మొదలైన ఆశావహుల దరఖాస్తు ప్రక్రియ.. పూర్తి వివరాలు ఇవే..

Published : Sep 04, 2023, 12:16 PM ISTUpdated : Sep 04, 2023, 12:26 PM IST
తెలంగాణ బీజేపీలో మొదలైన ఆశావహుల దరఖాస్తు ప్రక్రియ.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికతో ఉన్న పార్టీ నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి.. వాటి పరిశీలనలో నిమగ్నమైంది. ఇక, బీజేపీ కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికతో ఉన్న పార్టీ నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 

నేటి నుంచి ఈ నెల 10 వరకు టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను బీజేపీ స్వీకరించనున్నారు. ఈసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు టికెట్‌ ఆశించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో యువకులు, మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ దరఖాస్తు ఫార్మాట్‌ను సిద్దం చేసి, నాంపల్లి బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉంచామని.. పార్టీ జెండాతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఫారమ్‌ను నింపి సమర్పించాలని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రతి  రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లి బీజేపీ కార్యాాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఇలా వచ్చిన  దరఖాస్తుల నుంచి నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురి షార్ట్ లిస్ట్ చేసి.. ఆ జాబితాను పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపనున్నారు. ఆ జాబితాను క్షుణంగా పరిశీలించిన తర్వాత.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.

బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే నియోజక వర్గాల్లో సర్వే చేసి.. పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్న వారి అసలు ఆదరణ, గ్రౌండ్ లెవెల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే వివరాలను సేకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?