60 ఏళ్ల అరబ్ షేక్ ఇబ్రహీం 25 ఏళ్ల యువతిని కొనుగోలు చేశాడు. బాధితురాలిపై లైంగిక దాడికి దిగాడు. ఆమె సహకరించకపోవడంతో సిగరెట్లతో ఆమె శరీరంపై వాతలు పెట్టాడు.
హైదరాబాద్:హైద్రాబాద్ పట్టణంలో అరబ్ షేక్ కు దళారీ ఓ మహిళను విక్రయించాడు. ఆ మహిళపై అరబ్ షేక్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని చిత్రహింసలు పెట్టాడు. బాధితురాలిని కుటుంబసభ్యులు కాపాడారు.అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.
హైద్రాబాద్ లోని అంబర్‌పేటకు చెందిన వివాహిత ఫాతిమా ఉన్నీసాకు బార్కాస్ కొత్తపేట నబీల్ కాలనీలో ఇల్లుంది. ఈ ఇంటిని విక్రయించాలని ఆమె భావించింది.ఆర్ధిక అవసరాల కోసం ఈ ఇంటిని విక్రయించేందుకు నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఆమె దళారీ మహ్మద్ సాబెర్ అలియాస్ వోల్టా సాబెర్ ను ఆశ్రయించింది.
ఈ ఇంటిని కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి సిద్దంగా ఉన్నాడని ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన సాబెర్ ఆమెకు ఫోన్ చేశాడు. ఇల్లుచూపించేందుకు ఫాతిమా ఉన్నీసా తన చెల్లి రఫత్ ఉన్నీసాతో కలిసి వెళ్లింది.
ఈ ఇంటిని కొనుగోలు చేసేందుకు అరబ్ షేక్ ఇబ్రహీం షుక్రుల్లా ముందుకు వచ్చాడు. ఫాతిమా ఉన్నీసా అరబ్ షేక్ ఇబ్రహీం కు ఇంటిని చూపించింది.ఈ సమయంలో ఫాతిమా చెల్లెలు రఫత్ ను పెళ్లి చేసుకొంటానని అరబ్ షేక్ అడిగాడు. దీనికి ఫాతిమా చెల్లెలు నిరాకరించింది. రఫత్ ను కూడ ఇదే విషయమై ఆయన అడిగాడు. ఆమె కూడ ఈ పెళ్లికి నిరాకరించింది.
అయితే రఫత్ ను ఇబ్రహీం వద్దకు తీసుకొస్తానని దళారీ సాబేర్ అరబ్ షేక్ వద్ద డబ్బులు తీసుకొన్నాడు. ఏదో కారణం చెప్పి సాబేర్ తన భార్య ద్వారా రఫత్ ను తన ఇంటికి రప్పించాడు. ఆమె మాటలను నమ్మిన రఫత్ సాబేర్ ఇంటికి వచ్చింది.
రఫత్ ను సాబేర్ కుటుంబసభ్యులు అరబ్ షేక్ ఉంటున్న ఇంటికి తీసుకెళ్లారు. రపత్ ను గదిలోకి తీసుకెళ్లి గడియపెట్టారు. అప్పటి నుండి ఆమెపై అబర్ షేక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె సహకరించకపోతే సిగరెట్లతో ఆమె శరీరంపై కాల్చాడు. తన చెల్లెలి కోసం ఫాతిమా సాబేర్ ఇంటికి వెళ్తే సాబేర్ భార్య దాడికి దిగిందని బాధిత కుటుంబం చెబుతోంది.
Also read:హైద్రాబాద్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
తన సోదరి కోసం ఫాతిమా వెతికింది. చివరకు ఇబ్రహీం ఉంటున్న ఆచూకీని తెలుసుకొని ఆ ఇంట్లోకి వెళ్లేసరికి ఇబ్రహీం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఇబ్రహీం పాస్ పోర్టును ఫాతిమా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొన్నారు. ఇబ్రహీం పారిపోయారు.
అక్కడే ఉన్న రఫత్ ను సోదరి ఫాతిమా ఏం జరిగిందో అడిగింది. అరబ్ షేక్ తనపై లైంగిక దాడి దిగినట్టుగా చెప్పింది. అంతేకాదు చెప్పినట్టు వినకపోతే తనను సిగరెట్లతో కాల్చాడని బాధితురాలు సోదరికి చెప్పి విలపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.