హైద్రాబాద్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Published : Mar 02, 2020, 07:22 AM ISTUpdated : Mar 03, 2020, 12:58 PM IST
హైద్రాబాద్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

సారాంశం

హైద్రాబాద్ హస్తినాపురంలో విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్, స్వాతి దంపతులుగా గుర్తించారు. 


హైదరాబాద్: హైద్రాబాద్‌లోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఆర్ధిక ఇబ్బందులతోనే ఈ నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read:గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రదీప్, స్వాతి దంపతులు హైద్రాబాద్ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు.

ఐదేళ్ల కళ్యాణ్ కృష్ణ, ఏడాది వయస్సున్న జయకృష్ణ. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆదివారం నాడు రాత్రి ఇద్దరు  పిల్లలుకు పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత ప్రదీప్ , స్వాతిలు కూడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
 

PREV
click me!

Recommended Stories

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?