బయటివారు కాదంటే ఇంట్లో వారే కదా.. విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ విషయాలు

Published : Mar 02, 2020, 07:44 AM IST
బయటివారు కాదంటే ఇంట్లో వారే కదా..  విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ విషయాలు

సారాంశం

కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా,  హత్య జరిగిన టవర్ లోని ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం నివేదికగా ఆధారంగా హత్యకు పాల్పడింది బయట వ్యక్తులు కాదని పోలీసులు నిర్థారణకు వచ్చారు.

ఇటీవల కరీంనగర్ లో ఓ ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురైంది. కాగా... ఆ విద్యార్థిని హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. సదరు విద్యార్థిని బయటివారు ఎవరూ చంపలేదని  దర్యాప్తులో తేలింది. దీంతో కుటుంబసభ్యులే హత్య చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 10న కరీంనగర్ లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముండే ఇంటర్ విద్యార్థిని  రాధిక.. సొంత ఇంట్లో దారుణ హత్యకు గురైంది. గొంతుకోసి ఆమెను హత్య చేశారు. కాగా... కుటుంబసభ్యుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఈ కేసును సవాలుగా తీసుకున్నారు.

Also Read హైద్రాబాద్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య...

పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి 75మంది పోలీసులతో 8 బృందాలు ఏర్పాటు చేసి లోతుగా విచారణ చేయించారు. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా,  హత్య జరిగిన టవర్ లోని ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం నివేదికగా ఆధారంగా హత్యకు పాల్పడింది బయట వ్యక్తులు కాదని పోలీసులు నిర్థారణకు వచ్చారు.

కుటుంబసభ్యులు ఎవరో ఒకరు హత్య చేసి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు.. రాధిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా... ఇప్పటికీ హత్య ఎవరు చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్