black magic: కండ్ల‌ల్లో నిమ్మ‌ర‌సం కొడుతూ క్షుద్ర‌పూజలు.. బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో దొంగ స్వామీజీ బాగోతం

By Mahesh Rajamoni  |  First Published Dec 12, 2021, 9:55 AM IST

black magic: గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, ప‌ల్లెల్లో ఇప్ప‌టికీ మూడ‌న‌మ్మ‌కాలు రాజ్య‌మేలుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా మంత్రతంత్రాలు, గుప్త‌నిధులు, బాణామ‌తి వంటి వాటిని నమ్మిస్తూ.. అనేక మందిని మోసం చేస్తున్న దొంగ స్వామిజీలు ఎక్కువవుతూనే ఉన్నారు. ఇలాంటి దొంగ‌స్వామిజీ బాగోతం షాద్ న‌గ‌ర్‌లో ఆలస్యంగా బయటపడింది. 


Shadnagar:  కాలం ప‌రుగుల‌కు అనుగుణంగా ఎన్నో ఆధునిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, స‌మాజంలో నాటుకుపోయిన ప‌లు మూఢ‌న‌మ్మ‌కాలు ఇంకా పోవ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప‌ల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. ఎంతో మంది అమాయ‌క ప్ర‌జ‌ల‌ను  మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో దొంగ స్వామిజీలకు బలైపోతున్నారు. దొంగబాబాల  చేతిలో మోస‌పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి రంగారెడ్డి జిల్లా షాద్ న‌గ‌ర్‌లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క్షుద్ర‌పూజ‌ల పేరుతో ఓ దొంగ బాబా చేతిలో మోస‌పోయిన యువతి పోలీసులకు  ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల్లోకెళ్తే.. గ‌త కొంత కాలంగా రంగారెడ్డి జిల్లా  షాద్‌నగర్‌ మండల ప‌రిధిలోని కమ్మదనం గ్రామ శివారులో  ఓ దొంగ స్వామిజీ  క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివ‌స్వామి అనే వ్యక్తి కొంత‌కాలంగా స్థానికంగా ఉన్న ఓ ప్ర‌యివేటు వెంచ‌ర్ లో ఇల్లుక‌ట్టుకుని.. అక్క‌డ కాళీమాత విగ్రహం, మ‌రికొన్ని దేవ‌తామూర్తుల ప్ర‌తిమ‌లు పెట్టి పూజ‌లు చేస్తూ... స్వామిజీగా స్థానికంగా గుర్తింపు పొందాడు.

Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో పవన్ ఎలాంటి లేఖ రాయ‌లేదు !

Latest Videos

ఈ నేప‌థ్యంలోనే మంత్ర‌తంత్రాలు, క్షుద్ర‌పూజ‌ల‌తో రోగాలు న‌యం చేస్తానంటూ ప్ర‌చారం చేసుకుంటున్నాడు. ప‌లు కార‌ణాల‌తో అత‌ని  వద్దకు వెళ్లేవారి కళ్ల‌ల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొట్ట‌డం చేస్తున్నాడు. అలాగే,  అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. ఈ విష‌యం తెలిసిన  హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి  అత‌ని వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌లు క్షుద్ర‌పూజ‌లు చేయించింది. ఆ నేపథ్యంలోనే ఆ దొంగ స్వామిజీ అధిక మొత్తంలో డ‌బ్బులు తీసుకున్నాడు. అయితే, డ‌బ్బులు తీసుకొని  తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ దొంగ స్వామిజీ  ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు చూపించ‌డంతో దొంగ‌బాబా బాగోతం వెలుగులోకి వ‌చ్చింది.

Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో పవన్ ఎలాంటి లేఖ రాయ‌లేదు !

ఇక ఈ దొంగ స్వామిజీ బాగోతం పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ద‌ర్యాప్తును ప్రారంభించారు. దొంగ స్వామీపై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. స్టేష‌న్ లో అత‌న్ని విచా రించ‌గా, అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. తాను క్షుద్ర పూజలు చేయలేదని దొంగ‌స్వామీజీ చెప్పుకొచ్చాడు. కేవ‌లం ఎవ‌రికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని  పోలీసులు తెలిపారు. కాగా, గ‌తంలో మ‌ధురాపూర్ గ్రామంలోనూ ఇదే త‌ర‌హాలో క్షుద్ర‌పూజ‌లు, బాణామ‌తి, మంత్ర‌తంత్రాలు వంటి ప‌నులు చేస్తుండ‌టంతో  గ్రామస్తులు.. ఇలాంటి ప‌నులు ఇక్క‌డ చేయ‌వ‌ద్ద‌ని బెదిరించారు. దీంతో ఈ దొంగ బాబా క‌మ్మ‌ధ‌నం ప‌రిధిలోని వెంచ‌ర్ ద‌గ్గ‌ర‌కు చేరి.. క్షుద్ర‌పూజ‌లు చేయ‌డం ప్రారంభించాడు. 

Also Read: Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

click me!