బంజారాహిల్స్ డ్రంకెన్ డ్రైవ్ కేసు: తెరపైకి మూడో పేరు, రేపు పెళ్లి.. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు

By Siva KodatiFirst Published Dec 11, 2021, 10:20 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ (banjarahills) డ్రంకెన్ డ్రైవ్ కేసులో (drunk and drive case) మరో వ్యక్తిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. కారు డ్రైవ్ చేసిన రోహిత్ గౌడ్ అతని స్నేహితుడు సాయి సుమన్, వెంకటేశ్‌లను నిందితులుగా చేర్చారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు వెంకటేశ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ (banjarahills) డ్రంకెన్ డ్రైవ్ కేసులో (drunk and drive case) మరో వ్యక్తిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. మద్యం తాగి అతివేగంతో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు రోహిత్ గౌడ్. కారు డ్రైవ్ చేసిన రోహిత్ గౌడ్ అతని స్నేహితుడు సాయి సుమన్, వెంకటేశ్‌లను నిందితులుగా చేర్చారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు వెంకటేశ్. ఎల్బీ నగర్ అలకాపురి కాలనీకి చెందిన అతను కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్. ఈ నెల 12న వివాహం వుండటంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. 

ఇకపోతే... ప్రమాదానికి కారణమైన మందుబాబులు రోహిత్ (rohit) , సుమన్‌లు (suman) ఘటన జరగడానికి ముందు మూడు పబ్బుల్లో పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మూడు పబ్బుల్లో సీసీ కెమెరాలు ఫుటేజ్ సేకరించారు పోలీసులు. పబ్ నుండి బయటకి రాగానే బంజారాహిల్స్ హోటల్‌లో ఉండేందుకు రోహిత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రోహిత్‌పై 304 (2) , సుమన్ పై 109 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also Read:బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మ‌రో ట్విస్ట్‌.. మూడు పబ్బుల్లో పార్టీలు చేసుకుని, డ్రైవింగ్

ప్రమాదం తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైయ్యారు రోహిత్, సుమన్. అయితే… ఆ ఇద్దరిని ఛేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఈ సంద‌ర్భంగా వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మ‌ట్లాడుతూ… బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా ఆధారాలు సేకరించి, ఛార్జ్ షీట్ వేస్తామని వెల్లడించారు. వెస్ట్ జోన్‌లో పబ్ లు, బార్‌లు‌పై కూడా నిఘా ఉంటుందని… మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తామ‌ని వెల్ల‌డించారు. ఎక్కువ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యూత్ పట్టుబడుతున్నారన్నారు. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఈ కేసులో పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామ‌న్నారు.

click me!