తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కేసులు, 24 గంటల్లో 188 మందికి కరోనా .. 6,78,142కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Dec 11, 2021, 10:03 PM IST
తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కేసులు, 24 గంటల్లో 188 మందికి కరోనా .. 6,78,142కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణ (Telangana)లో కొత్తగా 188 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 193 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,891 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 35,978 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 188 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 6,78,142కి చేరింది. నిన్న కరోనాతో (corona deaths in telangana) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,005కి చేరింది. కరోనా మహమ్మారి బారి నుంచి నిన్న 193 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,891 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) 532 మంది వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. వీరిలో ఒక్కరికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో 16 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లయ్యింది. ఈ 16 మంది శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. 13 మందికి నెగెటివ్‌‌గా తేలగా, మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 78, జగిత్యాల 4, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 15, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 12, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 1, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 3, సిరిసిల్ల 0, రంగారెడ్డి 12, సిద్దిపేట 1, సంగారెడ్డి 4, సూర్యాపేట 2, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 21, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu