తన కూతుర్ని ఎత్తుకెళ్లారని కార్పోరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

Published : Oct 13, 2021, 12:00 PM ISTUpdated : Oct 13, 2021, 12:32 PM IST
తన కూతుర్ని ఎత్తుకెళ్లారని కార్పోరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

సారాంశం

తమ కూతురిని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ అమ్మాయి తల్లి కార్పోరేటర్ భర్తపై  చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. మాయా మాటలతో తన కూతురిని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది.

నిజామాబాద్: తమ కూతురిని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ అమ్మాయి తల్లి కార్పోరేటర్ husband చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. nizambad కార్పోరేషన్ లో ఓ పార్టీకి చెందిన మహిళా కార్పోరేటర్ భర్త తన కూతురిని మోసం చేశాడని బాధిత  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  

also read:Warangal Rape Case : అత్యాచారం కేసులో వరంగల్ కార్పొరేటర్ భర్త అరెస్ట్..

మాయా మాటలు చెప్పి తన కూతురిని కార్పోరేటర్ భర్త తీసుకెళ్లాడని వారు ఆరోపిస్తున్నారు. ఇవాళ కార్పోరేటర్ ఇంటి ముందు బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.తమ కూతురి ఆచూకీ తెలపాలని కార్పోరేటర్ భర్తను నిలదీశారు. తమ కూతురిని ఎక్కడికి తీసుకెశ్లావంటూ అమ్మాయి చెప్పుతో కొట్టింది. అమ్మాయి కుటుంబ సభ్యులు కార్పోరేటర్ భర్తను బూతులు తిట్టారు.

మాయా మాటలు చెప్పి తమ కూతురిని కార్పోరేటర్ భర్త మోసం చేశాడని అమ్మాయి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిని మరో ప్రజా ప్రతినిధి ఇంట్లో ఉంచాడని వారు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని  బాధిత కుటుంబసభ్యులు కార్పోరేటర్ ఇంటి ముందు నిరసనకు దిగారు.

667546519
 

PREV
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu