ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అంటే అర్ధం తెలియదు: సిర్పూర్కర్ కమిషన్‌తో సజ్జనార్

By narsimha lode  |  First Published Oct 13, 2021, 11:07 AM IST

రెండు రోజుల పాటు సిర్పూర్కర్ కమిషన్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ను పలు విషయాలపై ప్రశ్నించింది.  దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన రోజున చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయనను క్షుణ్ణంగా ప్రశ్నించింది. అయితే చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం తెలియదని చెప్పారు.



హైదరాబాద్:  మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిష్టా అంటూ vs sirpurkar commission సభ్యులు ఐపీఎస్ అధికారి sajjanar ను ప్రశ్నించారు. అయితే  మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి తనకు అర్ధం తెలియదని సజ్జనార్ చెప్పారు. అయితే disha accused encounter తర్వాత మీడియాలో వచ్చిన కథనాలను  కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా సజ్జనార్  దృష్టికి తీసుకొచ్చారు.

also read:సజ్జనార్‌కి సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం: డీసీపీ చెబితేనే ఎన్‌కౌంటర్ గురించి తెలిసింది

Latest Videos

undefined

రెండు రోజుల పాటు సిర్పూర్కర్ కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరయ్యారు. సోమ, మంగళవారాల్లో సజ్జనార్ సిర్పూర్కర్ కమిషన్ ముందు హాజరయ్యారు. మంగళవారం నాడు కమిషన్ సభ్యులు సుమారు 120 ప్రశ్నలను సజ్జనార్ కు వేశారు.

సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు వేసిన ప్రశ్నల్లో మెజారిటీ ప్రశ్నలకు సజ్జనార్ తనకు తెలియదనే సమాధానం చెప్పారని సమాచారం.నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కు తీసుకెళ్తున్న విషయం కూడా తనకు తెలియదని సజ్జనార్ చెప్పారు. మరోవైపు ఎన్ కౌంటర్ విషయం కూడా తనకు అదే రోజున ఉదయం ఆరున్నర గంటల సమయంలో తెలిసిందని సజ్జనార్ వివరించారు. shamshabad డీసీపీprakash reddy చెబితేనే  ఈ ఎన్‌కౌంటర్ గురించి తెలిసిందని  సజ్జనార్  తెలిపారు.

dishaపై అత్యాచారం, హత్య ఘటనతో్ పాటు నిందితుల అరెస్ట్, విచారణ గురించి డీసీపీ ప్రకాష్ రెడ్డికే పూర్తి వివరాలు తెలుసునని సజ్జనార్ చెప్పారు. అయితే ఈ విషయమై తనకు డీసీపీ సమాచారం ఇచ్చేవాడన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాను సమీక్ష మాత్రమే చేశానని  వివరించారు. 

పోలీసుల నుండి నిందితులు ఆయుధాలు లాక్కొనే సమయంలో ఆయుధాలు లాక్ చేసి ఉన్నాయా అన్ లాక్ చేసి ఉన్నాయా అనే విషయమై కమిషన్ సభ్యులు పదే పదే ప్రశ్నించారు.  ఎన్‌కౌంటర్ జరిగిన రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనార్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను కూడ కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా చూపారు.మీడియా సమావేశంలో ఆయుధాలు ఆన్‌లాక్ చేసి ఉన్నాయని ఎలా చెప్పారని కమిషన్ సభ్యులు సజ్జనార్ ను  ప్రశ్నించారు.

మీడియా సమావేశం సందర్భంగా గందరగోళ పరిస్థితులున్నాయని అందుకే అలా చెప్పి ఉంటానని సజ్జనార్ వివరించారు.మరోవైపు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని సిర్పూర్కర్ కమిన్ విచారించనుంది. ప్రకాష్ రెడ్డిని దసరా తర్వాత ఈ కమిషన్ విచారణ చేయనుంది.దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కు సంబంధించిన కీలకమైన ఆధారాలను సిర్పూర్కర్ కమిషన్ సేకరించింది. ఎన్ ‌కౌంటర్ జరిగిన రోజున ఫోన్ టవర్ల లోకేషన్లను సమాచారాన్ని సేకరించింది కమిషన్.

 


 

click me!