Huzurabad Bypoll: కేసీఆర్ కు ధీటుగా... అమిత్ షా, నడ్డాలతో బిజెపి మాస్టర్ ప్లాన్

By Arun Kumar PFirst Published Oct 13, 2021, 11:20 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు అటు టీఆర్ఎస్ ఇటు బిజెపి పార్టీలు సిద్దమయ్యారు. ఇరు పార్టీలు హేమాహేమీలతో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

కరీంనగర్:  హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలని బిజెపి చూస్తోంది. ఈ ఉపఎన్నికలో విజయం సాధించి తమకు తిరుగేలేదని... కేసీఆర్ సర్కార్ పనితీరుకు ఈ ఫలితమే నిదర్శనమని చెప్పుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు huzurabad bypoll ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో  సీఎం KCR ను TRS రంగంలోకి దింపాలని చూస్తుంటే... ఇందుకు ధీటుగా తమ పార్టీలోని హేమాహేమీలతో హుజురాబాద్ లో ప్రచారం చేయించాలని BJP భావిస్తోంది. 

హుజురాబాద్ లో ప్రచారానికి మరో 15రోజులు మాత్రమే సమయముంది. ఆ లోపు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని బిజెపి ప్రముఖులతో ప్రచారం చేయించాలని బిజెపి భావిస్తోంది. పోలింగ్ కు కొద్దిరోజుల ముందు టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ను రంగంలోకి దింపి ప్రచారాన్ని ఫీక్ కు తీసుకెళ్లాలని చూస్తోంది. దీంతో బిజెపి కూడా ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేసుకుంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ను తీసుకువచ్చి ప్రచారాన్ని హోరెత్తించాలని తెలంగాణ బిజెపి ప్రయత్నిస్తోంది. 

అయితే ఎన్నికల సంఘం కరోనా నేపథ్యంలో హుజురాబాద్  లో భారీ బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతించలేదు. దీంతో ఇటీవల హుజురాబాద్ లో జరగాల్సిన బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ హుజురాబాద్ పక్కనే  వున్న హుస్నాబాద్ లో జరిగింది. ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని బిజెపి నిర్ణయించింది. అమిత్ షా, నడ్డాలతో కూడా హుజురాబాద్ పక్కనే వున్న నియోజకవర్గాల్లో భారీ  బహిరంగసభలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

READ MORE  Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు కరోనా షాక్... మంత్రి గంగులకు పాజిటివ్

ఇదే వ్యూహాన్ని టీఆర్ఎస్ కూడా అనుసరించే అవకాశముంది. హుజురాబాద్ ఎన్నికలపై ప్రభావం వుండేలా పక్కనే వున్న నియోజకవర్గాల్లో ఏదోచోట కేసీఆర్ తో బహిరంగసభ నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలుత అమిత్‌షా సభను రద్దు చేసుకోవాలని భావించిన బిజెపి తిరిగి ఆయనతో బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించిందట. అమిత్‌షా సభతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రచారాన్ని ఫీక్ లోకి తీసుకెళ్లి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని బిజెపి ప్లాన్  గా తెలుస్తోంది. 

ఇక టీఆర్‌ఎస్‌ తరఫున ఇప్పటికే హరీష్ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అలాగే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తో మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. చివర్లో కేసీఆర్‌ సభతో ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత వేడెక్కించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోందని ఆ పార్టీ వర్గాల సమాచారం.

READ MORE  ఏదో చేయబోతున్నట్లు హైప్.. తర్వాత అటకపైకి: కేసీఆర్ సర్కార్‌పై విజయశాంతి సెటైర్లు

ఇప్పటికే అక్టోబర్ 1వ తేదీన హుజురాబాద్  election notification విడుదలై నామినేషన్ల స్వీకరణ కూడా ముగిసింది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించారు. ఇక అక్టోబర్ 13వరకు అంటే ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు గుడువు ముగుస్తుంది. ఈ నెల చివరన అంటే అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న  counting నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. 


 

click me!