గత కొంత కాలం నుంచి బీజేపీపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి.. ఆ పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన సుధీర్ఘ ట్వీట్ ఈ చర్చకు దారి తీసింది.
సినీ నటి విజయశాంతి బీజేపీలో కొనసాగుతారా ? లేదా అని అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న ఆమె.. గత కొంత కాలం నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. తనకు పార్టీలు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె భావిస్తున్నారు. ఇటీవల సోనియా గాంధీని తాను అభిమానిస్తానని ఆమె ఎక్స్ (ట్విట్టర్) ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అనేక ఊహాగానాలు బయలుదేరాయి. తాజాగా ఆమె చేసిన మరో సుధీర్ఘ పోస్ట్ దానికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారి, చర్చకు దారి తీసింది.
ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ - కస్టడీలో రోదిస్తూ చెప్పిన అనురాధ
‘‘ఇది తెగింపుల సంగ్రామం, తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటుతో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మరో సార్వత్రిక స్వతంత్ర పోరాటం. తెలంగాణ బిడ్డలు ఇప్పటికే భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరువు దించుకోనీకి సన్నద్ధమైనరు. ’’ అని ఆమె తన సుధీర్ఘ ట్వీట్ ప్రారంభంలో పేర్కొన్నారు.
విషాదం.. ఇంజెక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మరణం..హన్మకొండలో ఘటన
‘‘ ఆ ఫలితాలే దుబ్బాక , గ్రేటర్ హైదరాబాద్, టీచర్స్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ ఇంకా, దగ్గర దగ్గరగా మునుగోడు, నాగార్జునసాగర్ మొదలైనవి. అయితే భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఓడగొట్టగలిగిన అభ్యర్ధిని గెలిపించి, లేదా గెలుపు వరకు తెచ్చిన విజ్ఞులైన తెలంగాణ ఓటర్లు, తమ ఓటు చీలకుండా , మూడో పార్టీ ప్రధాన పోటీలో లేనప్పుడు జాతీయ పార్టీ ఐనప్పటికి, డిపాజిట్ రాని స్ధాయికి కూడా ఆ పార్టీలను పరిమితం చేసినరు. అదే తెలంగాణ జన శ్రేణుల విచక్షణ.’’ అని విజయశాంతి తెలిపారు.
ధైర్యంగా ఉండండి.. న్యాయమే తప్పకుండా విజయం సాధిస్తుంది - టీడీపీ అభిమానులతో నారా భువనేశ్వరి
అదే ట్వీట్ లో ‘‘ ఈ అంశమై భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని గద్దె దింపాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు... ఆ ప్రజా విశ్వాసాన్ని తమవైపు తిప్పుకుని ప్రజాస్వామ్య పోరాటానికి మరింత పెద్ద ఎత్తున అన్ని విధాలుగా యుద్ధసన్నద్ధలవుతారని తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నదని ప్రజల నుండి అందుతున్న సమాచారంగా నాతోటి తెలంగాణ ఉద్యమకారులు తెలుసుకుంటున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ’’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం: టీడీపీ సభ్యుల ఆందోళనలపై బుగ్గన ఆగ్రహం
చివరగా.. ‘‘ఇక, ఎన్నికల ప్రస్తావన కాబట్టి, యావత్ మహిళా లోకం మనస్ఫూర్తిగా స్వాగతించే నారీ శక్తి వందన బిల్లు మహిళా రిజర్వేషన్ కోసమై తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వములోని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’’ అని తెలిపారు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.