బ్యూటీషియన్ శిరీష చుట్టే తిప్పుతున్నారెందుకో?

Published : Jun 17, 2017, 08:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బ్యూటీషియన్ శిరీష చుట్టే తిప్పుతున్నారెందుకో?

సారాంశం

శిరీష ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే పోలీసులు చెప్పే కారణాల్లో కొన్ని విచిత్రంగా ఉన్నాయి. రాజీవ్, శ్రావన్ వేధించడం లాంటివి చెబుతున్నప్పటికీ ఎస్సై ప్రభాకర్ రెడ్డి పాత్రను కూడా ఇందులో జత చేస్తున్నారు. నిజానికి ఎస్సై ప్రభార్ రెడ్డి పాత్ర ఎంతవరకుందన్నదానిపై ఇంకా విచారణ సాగుతోంది. కానీ కొందరు పోలీసు పెద్దలు తొందరపడి ముందే కూయడం వివాదాస్పదమయింది. నా భర్తను ఉన్నతాధికారులు మామూళ్ల కోసం వేధించారన్న రచన మాటలు ఇక్కడ కీలకంగా మారాయి. 

xతెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణాలపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.  కానీ అనేక సందేహాలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. శిరీష మరణంపై హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. మరి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసులో ఇంకా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.

 

శిరీష ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే పోలీసులు చెప్పే కారణాల్లో కొన్ని విచిత్రంగా ఉన్నాయి. రాజీవ్ కొట్టడం, శ్రావన్ వేధించడం లాంటివి చెబుతున్నప్పటికీ ఎస్సై ప్రభాకర్ రెడ్డి పాత్రను కూడా ఇందులో జత చేస్తున్నారు. నిజానికి ఎస్సై ప్రభార్ రెడ్డి పాత్ర ఎంతవరకుందన్నదానిపై ఇంకా విచారణ సాగుతోంది. కానీ కొందరు పోలీసు పెద్దలు తొందరపడి ముందే కూయడం వివాదాస్పదమయింది.

 

ఎస్సై ఆత్మహత్య చేసుకుని క్షణాలు గడవకముందే మీడియాకు లీకులొచ్చాయి. ప్రభాకర్ రెడ్డి బ్యుటీషియన్ శిరీషను అత్యాచారం చేశాడు అని. ఈ విషయాన్ని మీడియా బ్రేకింగులతో బద్ధులు చేసింది. ఒకవైపు ప్రభాకర్ రెడ్డి మరణించాడు. కాల్చుకున్న చోట రక్తపు మరకలు ఆరకముందే అతడి క్యారెక్టర్ పై అంభాండాలేశారు. దీంతో కొందరు స్థానికులు ఈ తతంగంలో పోలీసు  పెద్దలు ఉన్న విషయాన్ని మరచిపోయి దాన్ని ప్రసారం చేసిన మీడియాపై పడ్డారు. ఎన్ టివి ఓబి వ్యానుకు నిప్పు పెట్టారు.

 

మరి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసునంతా బ్యూటీషియన్ శిరీష మరణం చుట్టూ తిప్పుతూ కొందరు పోలీసు పెద్దలు కుట్రలు రచిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఆయన శిరీషను రేప్ చేశాడని ప్రచారం చేశారు. దానిపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహ జ్వాలలు రగిలిన  నేపథ్యంలో సదరు పోలీసు పెద్దలు మాట మార్చారు. రేప్ జరగలేదు. అత్యాచార యత్నం మాత్రమే చేశాడని మాట మార్చారు. ప్రభాకర్ రెడ్డి చనిపోయిన మరుక్షణమే ఆయన మరణానికి శిరీష మరణానికి లింకు చేస్తూ రేప్ ఇష్యూని బయటకు తీశారు.

 

ఆ తర్వాత ఇది వర్కువుట్ కాదని తేలడంతో రేప్ కాదు కానీ రేప్ అటెంప్ట్ మాత్రమే చేశాడని అంటున్నారు. మరో నాలుగైదు రోజుల తర్వాత రేప్ చేయలేదు, అత్యాచార యత్నం చేయలేదు, క్యాజువల్ గా మందలించాడు అంతే అని చెబుతారేమో? ఇంకొద్దిరోజుల తర్వాత ఇంకెన్ని కట్టు కథలు అల్లుతారన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఎస్సై ప్రభార్ రెడ్డి కాల్చుకున్నాడంటే కేవలం శిరీషను బలాత్కారం చేయబోయినందుకు బెదిరిపోయి చేసుకున్నాడని పోలీసులు చెబుతున్న విషయాన్ని ఎస్సై కుటుంబసభ్యులు అంగీకరించడంలేదు. సభ్య సమాజం కూడా ఆ ఒక్క విషయమే ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు కారణం అంటే నమ్మే పరిస్థితి లేదు. మానసికంగా ఎంతటి బలహీనమైన వ్యక్తి అయినా ఒక్క కారణం చేత ఆత్మహత్య చేసుకునే దాఖలాలు చాలా తక్కువ. మరి అలాంటప్పుడు ఒక ఎస్సై స్థాయి వ్యక్తి ఈ ఒక్క కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎలా నమ్మడం అన్నది ప్రశార్థకంగా మారింది.

 

పోలీసులు ఎంతసేపు శిరీష మరణం చుట్టే ప్రభాకర్ రెడ్డి మరణం సంఘటనను తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానికితోడు ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎస్సై కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా  పోలీసుల ప్రయాత్నాలు సాగకుండా సదరు ఉన్నతాధికారులు విచారణకు అడ్డు తగులుతున్నట్లు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై ప్రభాకర్ రెడ్డి భార్య రచన పదేపదే ఒక విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఎసిపి గిరిధర్ తనను వేధిస్తున్నాడని, మామూళ్ల కోసం హింసిస్తున్నాడని ఎస్సై తనతో పలుమార్లు చెప్పాడని ఆమె గుర్తు చేస్తోంది. ఉన్నతాధికారులు డబ్బుల కోసం వేధింపులు తీవ్రమయిన  పరిస్థితి ఇక్కడ స్పష్టంగా  కనిపిస్తోంది.

 

ఒకవైపు మామూళ్ల కోసం ఉన్నతాధికారుల వేధింపులు, మరోవైపు గాలికి పోయే చెత్త తనకు తగులుకోవడంతో ఈ రెండు ఒత్తళ్లు ఎస్సైని ఉక్కిరి బిక్కిరి చేశాయి. గత కొంత కాలంగా ఎస్సై మామూళ్లు ముట్టచెప్పలేకుండా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మరోవైపు తాజాగా జరిగిన ఈ ఘటన వల్ల తనకు భవిష్యత్తు లేదని భావించాడేమో అని భావించాల్సి వస్తోంది. ఎస్సైకి మానసికంగా దెబ్బ మీద దెబ్బ తగిలినందున ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నయి.

 

కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ మంచి కమర్షియల్ సెంటర్ అని పోలీసు వర్గాల్లో ప్రచారోం ఉంది. అక్కడ పనిచేసే వారికి చేతినిండా కాసులే అన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో అనుకోకుండా అక్కడికి బదిలీపై వచ్చిన ప్రభాకర్ రెడ్డి మీద తమకు మామూళ్లు ముట్టచెప్పాలన్న ఒత్తిళ్లు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. దీంతో మామూళ్లు ఇవ్వలేక ఉన్నతాధికారులతో ఛీదరింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.  దీనికి జతగా శిరీష ఘటన జరగడంతో తనను ఉన్నతాధికారులు టార్గెట్ చేసి వేధిస్తారన్న భయంతోనే ఎస్సై  ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

 

మొత్తానికి ఎస్సై ఆత్మహత్యకు కారణాల్లో అసలు కారణం మామూళ్ల వేధింపులు కాగా రెండో కారణం శిరీష మరణం అన్నది  కుటుంబసభ్యుల నుంచి వస్తున్న మాట. మరి పోలీసు పెద్దలు మాత్రం ఎస్సై ఆత్మహత్య కేసులో కేవలం శిరీష మరణం వల్లే ఎస్సై ఆత్మహత్య అన్నట్లు మాట్లాడడం చూస్తే ఈకేసును శిరీష మరణం చుట్టే తిప్పి క్లోజ్ చేస్తారేమోనని అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారుల మామూళ్ల వేధింపుల కోణంలో ఈ కేసును విచారిస్తే అసలు వాస్తవాలు  వెలుగులోకి వస్తాయని ప్రజాస్వామికవాదులు అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే