తెలంగాణ సచివాలయం కూల్చివేతలో గోప్యత ఎందుకు: హైకోర్టు ప్రశ్న

By narsimha lodeFirst Published Jul 23, 2020, 6:21 PM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేతల విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా బులెటిన్ మాధిరిగానే సచివాలయం కూల్చివేతల విషయమై బులెటిన్ ఇవ్వొచ్చుగా అని హైకోర్టు ప్రశ్నించింది.


హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతల విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా బులెటిన్ మాధిరిగానే సచివాలయం కూల్చివేతల విషయమై బులెటిన్ ఇవ్వొచ్చుగా అని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారంనాడు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై బుధవారం నాడు విచారణ సాగింది. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ కూడ విచారణ నిర్వహించారు.

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: రేపటి వరకు స్టే పొడిగించిన హైకోర్టు

సచివాలయం కూల్చివేతల వద్దకు ఎవరిని కూడ అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సెక్షన్ 180 ఇ ప్రకారం సైట్‌లో పనిచేసే వారే ఉండాలని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కూల్చివేతల అంశంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

ఇప్పటికే 95 శాతం సచివాలయం కూల్చివేత పనులు పూర్తయ్యాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే కరోనా బులెటిన్  ఏ విధంగా విడుదల చేస్తున్నారో కూల్చివేతలకు సంబంధించి కూడ బులెటిన్ కూడ విడుదల చేయొచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి సోమవారం నాడు తెలుపుతామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అయితే సోమవారం వరకు తాము సమయం ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. 

కూల్చివేతల విషయంలో ఈ నెల 24వ తేదీ లోపుగా ప్రభుత్వ వైఖరిని చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.ఈ పిటిషన్ పై విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది హైకోర్టు.


 

 

click me!