హైద్రాబాద్‌లో ఆసుపత్రి భవనం నుండి దూకి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య

By narsimha lodeFirst Published Jul 23, 2020, 3:49 PM IST
Highlights

హైద్రాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ ఆసుపత్రి భవనంపై నుండి దూకి నరేందర్ అనే వ్యక్తి గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎయిర్‌ఫోర్స్ లో పనిచేసే ఆయన బుధవారం నాడు ఆసుపత్రిలో చేరాడు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరాడు. 
 

హైదరాబాద్: హైద్రాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ ఆసుపత్రి భవనంపై నుండి దూకి నరేందర్ అనే వ్యక్తి గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎయిర్‌ఫోర్స్ లో పనిచేసే ఆయన బుధవారం నాడు ఆసుపత్రిలో చేరాడు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరాడు. 

కరోనా వచ్చిందనే అనుమానంతో ఇవాళ ఉదయం ఆయన ఆసుపత్రి భవనం పై నుండి దూకాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మరణించినట్టుగా ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

also read:కరోనా దెబ్బ: బాలాపూర్ గణేషుడి లడ్డు వేలం రద్దు

కరోనా వచ్చిందో రాదో తెలుసుకోకుండానే ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కల్గిస్తోంది. ఆయన మృతికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో బుధవారం నాటికి కరోనా కేసులు 49,259కి చేరుకొన్నాయి. బుధవారం నాడు 1,554 కేసులు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 438 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదౌతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.

click me!