తెలంగాణలో కరోనా కమ్యూనిటీలోకి వెళ్లిందని తెలంగాణ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కమ్యూనిటీలోకి వెళ్లిందని తెలంగాణ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు.
గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రీణి నగరాల్లో కూడ కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వచ్చే నాలుగైదు వారాలు చాలా క్లిష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
undefined
also read:ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు కరోనాతో మృతి
యాక్టివ్ గా ఉన్న వాళ్లకు కరోనా టెస్టులు అవసరం లేదన్నారు. లక్షణాలు ఉంటేనే టెస్టులు చేసుకోవాలని ఆయన సూచించారు.కరోనా లక్షణాలు త్వరగా వస్తే అతి తక్కువ ఖర్చుతోనే చికిత్స చేయవచ్చని ఆయన చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజలంతా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన సూచించారు.ప్రస్తుతం వర్షా కాలం ప్రారంభమైంది. దీంతో సీజనల్ వ్యాధులు కూడ వచ్చే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. నాలుగైదు వారాలు చాలా క్లిష్టమైనవని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:61 ఆసుపత్రుల్లో చికిత్సలు, 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు: హైకోర్టుకు తెలంగాణ సర్కార్
హైద్రాబాద్ లో కరోనా నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొందన్నారు. ఈ చర్యలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కరోనా లక్షణాలే కాదు ఇతర వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేసుకోవాలని ఆయన సూచించారు.
కరోనా చికిత్స కు రూ. 100 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పారు. 70 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే ఉన్నారన్నారు.తెలంగాణలో కరోనా బారినపడిన వారిలో 99 శాతం మంది రికవరీ అయ్యారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో రోజు 15 వేల టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రతను చూస్తే కమ్యూనిటి స్ప్రెడ్ అనడం కంటే లోకల్ ట్రాన్స్ మిషన్ గా చెప్పొచ్చని ఆయన ఆ తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎవరూ పనిచేయకూడదని డీఎంఈ రమేష్ రెడ్డి కోరారు. కరోనా విషయంలో హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.మెడికల్ సిబ్బంది చాలా ఒత్తిడిలో ఉన్నారని ఆయన చెప్పారు. మెడికల్ డిపార్ట్‌మెంట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు.
ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందన్నారు. ఉస్మానియాలో రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పాత భవనాన్ని ఖాళీ చేస్తున్నామన్నారు.