జగిత్యాల ప్రేమ దేశం కథ: అక్కా చెల్లెళ్లతో వన్‌సైడ్ లవ్, భయంతోనే....

Published : Oct 02, 2018, 04:30 PM IST
జగిత్యాల ప్రేమ దేశం కథ: అక్కా చెల్లెళ్లతో వన్‌సైడ్ లవ్, భయంతోనే....

సారాంశం

జగిత్యాలలో పట్టణంలో పదోతరగతి చదవుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది

జగిత్యాల: జగిత్యాలలో పట్టణంలో పదోతరగతి చదవుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇద్దరు అక్కా చెల్లెళ్లను మహేందర్, రవితేజలు ప్రేమించారు. ఈ విషయాన్ని గుర్తించిన అమ్మాయిల కుటుంబసభ్యులు  వీళ్లను మందలించారు.  ప్రేమ విఫలమైందని భావించిన వీరిద్దరూ  సూసైడ్ చేసుకొన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

జగిత్యాల పట్టణానికి చెందిన  కె.రవి, లత దంపతుల చిన్న కుమారుడు మహేందర్.  ఇదే పట్టణంలోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న బంటు శ్యామల కొడుకు శ్యామల కొడుకు  రవితేజ.వీరిద్దరూ కూడ స్నేహితులు. ఇద్దరూ కూడ పదో తరగతి చదవుతున్నారు.

మహేందర్ రెగ్యులర్ గా స్కూల్‌కు వెళ్లేవాడు. రవితేజ స్కూల్ విషయంలో కొంత డుమ్మాలు కొట్టేవాడని తేలింది.అయితే రవితేజకు కొన్ని చెడు అలవాట్లు కూడ ఉన్నాయని  పోలీసులు చెబుతున్నారు. మత్తు పదార్ధాలకు రవితేజ అలవాటు పడ్డాడు.ఈ విషయమై  పోలీసులు గతంలో రవితేజకు కౌన్సిలింగ్‌ కూడ ఇచ్చారు.

మహేందర్, రవితేజలు  ఓ స్కూల్లో చదువుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రేమించారు. వీరిద్దరూ కూడ ఈ అమ్మాయిలతో ఫోన్లలో చాటింగ్ చేసేవారు. ఈ విషయం ఆ అమ్మాయిల కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో మహేందర్, రవితేజలను అమ్మాయిల కుటుంబసభ్యులు మందలించారు.

వారం రోజుల క్రితం అమ్మాయి ఇంటి వైపుకు వీరు వెళ్లగా మరోమారు మందలించారు. దీంతో తమ ప్రేమ విఫలమైందని భావించి మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహేందర్‌, రవితేజకు సంబంధించి ఎనిమిది మంది స్నేహితులను పోలీసులు విచారించారు. సంఘటనా స్థలంలో లభించిన సెల్‌ఫోన్‌కాల్‌ డాటా ఆధారంగా వివరాలు సేకరించారు.

తమ ప్రేమ ఫెయిలైందని వీరిద్దరూ భావించారు.  ఆర్ఎక్స్ 100 సినిమాలో మాదిరిగా  ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.  ఈ విషయమై స్నేహితులకు కూడ చెప్పారని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై పెట్రోల్ తెచ్చుకొని  ఆదివారం నాడు వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.మరికొందరు స్నేహితులను కూడ విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

'Rx100' ప్ర‌భావంతో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు.. డైరెక్టర్ ఏమన్నాడంటే!

జగిత్యాల ప్రేమదేశం కథ: ఇద్దరమ్మాయిలతో చాటింగ్, ప్లాన్‌తోనే ఆత్మహత్యలు

జగిత్యాల ప్రేమ దేశం కథలో ట్విస్ట్: ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు