ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో (Telangana assembly elections 2023) 15 శాతం ఓట్లు పొంది, 8 సీట్లు గెలుపొందామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి అందించాలని ఆయన నాయకులు, కార్యకర్తలను కోరారు.
etela rajender : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 15 శాతం ఓట్లు పొంది 8 సీట్లు గెలుపొందామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ గెలుపునకు అహర్నిషలు కష్టపడ్డ ప్రతీ నాయకునికి, కార్యకర్తకి హృదయపూర్వక అభినందనలని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు పెట్టారు.
ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ సస్పెన్షన్ ను ఎత్తివేసిన ఈసీ
అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు లోకసభ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈటల రాజేందర్ సూచించారు. కొందరు తమని బలహీనపరచడానికి, అనైఖ్యత సృష్టించి లాభం పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దయచేసి వాళ్ళ ట్రాప్ లో పడకూడదని కోరారు. అందరి లక్ష్యం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించడమే అని అన్నారు. ‘‘ఆ దిశగా పనిచేద్దాం తప్ప సోషల్ మీడియాలో చిల్లరగాళ్ళ.. పిచ్చి పోస్టులకు నా అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దు అని మనవి.’’ అని ఆయన పేర్కొన్నారు.
లోక సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణ.. బంగ్లా ఖాళీ చేయాలని హౌసింగ్ కమిటీ ఆదేశం..
కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యింది. చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థులకు తీవ్ర పోటీ ఇచ్చారు. అయితే గతం కంటే ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి ఓటు శాతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు కూడా పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు గెలుపొందారు.
2024 లోక్ సభ ఎన్నికలు.. నరేంద్ర మోడీ, బీజేపీదే పై చేయి.. ఇవిగో 5 కారణాలు..
అందులో కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, ముథోల్ నుంచి రామ్ రావ్ పవార్, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్భన్ నుంచి ధన్ పాల్ సూర్య నారాయణ, గోషామహల్ నుంచి టి. రాజాసింగ్, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు, సిర్పూర్ నుంచి డా.పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించారు. అయితే వీరంతా ఇంకా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేదు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు.