రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలలు తప్పించుకుందిగా.. ఇప్పుడు ఆగమేఘాల మీద రైతు బంధు డబ్బులు వేసి.. రైతు భరోసా కింద కౌలు రైతులకూ పెట్టుబడి సాయం వేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీని అమలు చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి రోజుల వ్యవధిలోనే డబ్బులు వేయాల్సి రావడంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు తప్పించుకుందిగా? అని బీఆర్ఎస్ వర్గాలు విమర్శలు చేస్తున్నారు.
Rythu Bandhu: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నది. రైతు బంధు పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. నిన్న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కావాల్సి ఉన్నందున.. గతంలో అమల్లో ఉన్న రైతు బంధు పద్ధతినే పాటించాలని సూచించారు. రైతు బంధు పథకం కింద లబ్దిదారులుగా ఉన్న వారికి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఈ కారణంగా రైతు బంధుకు కౌంటర్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులతోపాటు కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా సీఎం ఆదేశాలతో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ లేనట్టే అయింది. ఇది వరకు ఉన్న లబ్దిదారులకే సీఎం రేవంత్ రెడ్డి కూడా డబ్బులు పంపిణీ చేయడానికి ఆదేశించినట్టయింది. ఈ పాయింట్ పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది.
కేటీఆర్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు. కౌలు రైతులను ఎట్ల గుర్తిస్తారో.. పైసలు ఎట్లా వేస్తారో చూద్దామని అనుకుంటే.. వీళ్లు ఆరు నెలలు తప్పించుకున్నారుగా? అని సృష్టి అనే ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. అంటే.. ఈ యాసంగికి 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం లేనట్టేనా? అని ప్రశ్నించింది. ఇప్పుడు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందనందుకు ముఖ్యమంత్రి మరో బహిరంగ లేఖ రాస్తాడా? అని అడిగింది. ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీపోస్ట్ చేసింది. మళ్లీ వచ్చే పసలు వరకు రైతు భరోసా నిధుల పంపిణీ ఉండదు. అంటే మరో ఆరు నెలల వరకు కాంగ్రెస్‌కు సమయం దొరికినట్టే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇంకా బీఆర్ఎస్ విమర్శలు చేయలేదు. హరీశ్ రావు డిసెంబర్ 9వ తేదీన విమర్శించారు. ఇంకా ఎప్పుడు రైతు బంధు పైసలు వేస్తారో చెప్పాలని అడిగారు. తాజాగా, కేటీఆర్ కూడా ఓ ట్వీట్ రీపోస్టు చేసి రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలకు తెరలేపాడని అర్థం అవుతున్నది.
Also Read: ఎన్నికలకు ముందూ, తరువాత రైతుబంధు చుట్టూ ఏం జరిగిందంటే...
కౌలు రైతులను గుర్తించడం సవాళ్లతో కూడుకున్న పని. కైలు రైతులు ఎప్పుడూ ఒకే యజమాని భూమిలో పంట పండిస్తారని లేదు. ఎప్పుడూ ఒకే విస్తీర్ణంలో పంట వేస్తారనే నమ్మకమూ లేదు. ఇలాంటివి పసలు పసలుకు కూడా మారొచ్చు. కాబట్టి, యజమానుల ద్వారా కౌలు రైతులను గుర్తించడం కష్టమేనని చెబుతున్నారు. ఒక వేళ యజమానుల ద్వారా కౌలు రైతులను గుర్తించినా.. అందులో నూ వారు కొంత చేతివాటం చూపెట్టే అవకాశాలు లేకపోలేదు.