పార్లమెంట్ వేదికగా తనను శూర్పణఖ అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా రేణుకా చౌదరి చెప్పారు.
హైదరాబాద్: తనపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన శూర్ఫణఖ వ్యాఖ్యలపై కేసు పెడతానని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు.ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా ఆమె వివరించారు.
ఆదివారంనాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లోనే తనను ప్రధాని మోడీ శూర్ఫణఖ అంటూ వ్యాఖ్యానించారని ఆమె గుర్తు చేశారు. శూర్పణఖది ఏ కులమని ఆమె ప్రశ్నించారు. మోడీ ఓబీసీ అని ఆయనకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. తాను కూడా కర్ణాటకకు వెళ్తే బీసీనే అవుతానని రేణుకా చౌదరి చెప్పారు..ఉద్దేశ్యపూర్వకంగానే రాహుల్ గాంధీపై కేసులు పెట్టారని ఆమె మండిపడ్డారు. శూర్పణఖది ఏ కులమో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. దక్షిణ భారత దేశం అంటే మోడీకి చిన్న చూపు అని ఆమె ఆరోపించారు. నార్త్ అంటేనే మోడీకి ప్రేమ అని ఆమె విమర్శించారు.
undefined
ప్రధాని నెహ్రు గురించి తన చిన్నతంలో తమ పేరేంట్స్ గొప్పగా చెప్పేవారన్నారు. కానీ మోడీ గురించి ఈ తరం పిల్లలకు చెప్పడానికి ఏమీ లేదన్నారు. చట్టాలంటే ఏమిటి, మహిళలను ఎలా గౌరవించాలనే విషయం మోడీకి తెలియదన్నారు. ప్రధానిగా మోడీ ఇలా వ్యాఖ్యలు చేస్తే దేశంలో మహిళలకు ఏం రక్షణ ఉంటుందని రేణుకా చౌదరి ప్రశ్నించారు. తనపై మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు.
శూర్పణఖ ఓసీ కాదు కదా అని ఆమె గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడాన్ని రేణకా చౌదరి తప్పుబట్టారు.
2018 ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అడ్డుతగిలారు. అంతేకాదు బిగ్గరగా ఆమె నవ్వారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. టీవీలో రామాయణం సీరియల్ ముగిసిన తర్వాత మళ్లీ శూర్పణఖ నవ్వు వినే అదృష్టం లేకుండా పోయిందని ఆయన సెటైర్లు వేశారు.
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కకర్ణాటకలో చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దొంగల ఇంటి పేరు మోడీ ఎందుకు ఉందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గత వారంలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.