కాంగ్రెస్‌లో చేరిన డీఎస్, సంజయ్: పార్టీ కండువా కప్పిన ఠాక్రే

Published : Mar 26, 2023, 12:55 PM ISTUpdated : Mar 26, 2023, 02:07 PM IST
కాంగ్రెస్‌లో  చేరిన డీఎస్, సంజయ్: పార్టీ కండువా  కప్పిన ఠాక్రే

సారాంశం

మాజీ మంత్రి డి.శ్రీనివాస్, ఆయన తనయుడు  సంజయ్   కాంగ్రెస్ పార్టీ తీర్ధం  పుచ్చుకున్నారు.  

హైదరాబాద్: మాజీ మంత్రి డి.శ్రీనవాస్, ఆయన  తనయుడు డి.సంజయ్ లు  ఆదివారంనాడు  కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  కాంగ్రెస్ కండువా  కప్పి  డి.శ్రీనివాస్, ఆయన  తనయుడు  సంజయ్ లను  పార్టీలోకి  ఆహ్వానించారు.  ఇవాళ  ఉదయం  గాంధీ భవన్ లో  జరిగిన  కార్యక్రమంలో  డీఎస్, డి. సంజయ్ లు  కాంగ్రెస్ తీర్ధం  పుచ్చుకున్నారు. 

also read:చేరనని తొలుత లేఖ: ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతానని ట్విస్టిచ్చిన డీఎస్

డీఎస్ కాంగ్రెస్ పార్టీలో  చేరుతారని  కొంతకాలంగా  ప్రచారం సాగుతుంది.  కాంగ్రెస్ పార్టీ  మాజీ చీఫ్ సోనియాగాంధీతో  కూడా  డి.శ్రీనివాస్ గతంలో  సమావేశమయ్యారు.  కానీ  డి.శ్రీనివాస్ పార్టీలో  చేరలేదు.  ఉమ్మడి  నిజమాబాద్ కు  చెందిన  ఆ పార్టీ నేతలు  డి.శ్రీనివాస్ చేరికను వ్యతిరేకిస్తున్నారు.  ఈ విషయమై  పార్టీ నాయకత్వం  జిల్లా నేతలతో  చర్చించింది. జిల్లా  నేతలను  ఈ విషయమై  పార్టీ  రాష్ట్ర నాయకత్వం  ఒప్పించిందనే  ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. అధికారాన్ని  కోల్పోయిన తర్వాత  పార్టీని వీడిన  డి.శ్రీనివాస్ ను  తిరిగి  పార్టీలోకి చేర్చుకోవడంపై జిల్లా నేతలు వ్యతిరేకించారు.  ఇవాళ ఉదయం  గాంధీ భవన్ కు  డి.శ్రీనివాస్ చేరుకున్నారు.  కొడుకు  సంజయ్ తో  కలిసి  డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం  పుచ్చుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం