బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యం వల్ల తెలంగాణ ఏడు మండలాలను కోల్పోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan reddy)అన్నారు. విభజన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏడు మండలాలను కోల్పోయిందని కాంగ్రెస్ సీనియర నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు మరణాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. దివంగత ప్రధాని అంత్యక్రియలు అన్ని మర్యాదలతో జరిగాయని చెప్పారు. ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం..
undefined
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా భద్రాచలంలోని ఏడు మండలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. సీలేరు ప్రాజెక్టును కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు తెలంగాణకు ఐటీఐఆర్ ఆమోదం లభించేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం మానకుంటే బాగుంటుందని చెప్పారు.
కదులుతున్న బస్సులో దళిత యువతిపై గ్యాంగ్ రేప్..
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రధాని పీవీ నరసింహరావును మరణానంతరం కాంగ్రెస్ అవమానించిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల జీవన్ రెడ్డి స్పందించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిజమైన కాంగ్రెస్ నాయకుడని చెప్పారు. ఆయన అంత్యక్రియలు అన్ని మర్యాదలతో జరిగాయని, ఈ అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.
హైదరాబాద్ లో పేలుడు.. ఒకరు మృతి ?
పీవీ నరసింహారావు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే ఆయన అంతిమ యాత్ర హైదరాబాద్ లో జరిగిందని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఈ అంశాన్ని రాజకీయం చేయడం దారుణమని చెప్పారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్ ను విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. కాగా.. దివంగత ప్రధానుల తరహాలో ఢిల్లీలో పీవీ నరసింహరావు స్మారక స్థూపానికి స్థలం కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. దానిని జీవన్ రెడ్డి తిప్పికొట్టారు.