కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) మంత్రి పదవి పొందేందుకే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై విమర్శలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ఆరోపించారు. మంత్రి పదవి కోసం ఇంతలా దిగజారిపోకూడదని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొంది, మంత్రి పదవి దక్కించుకునేందుకే హరీశ్ రావుపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..
undefined
జీవన్ రెడ్డి మంత్రి పదవికి నిజంగా అర్హుడే అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. కానీ పదవి కోసం ఆయన దిగజారిపోకూడదని సూచించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణానంతరం కాంగ్రెస్ అధిష్ఠానం అవమానించిందని అన్నారు. ఢిల్లీలో ఆయనకు అంతిమ సంస్కారాలు, స్మారక చిహ్నాన్ని నిరాకరించి తెలంగాణలోని కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని చెప్పారు. హరీష్ రావు ఆ విషయాన్ని మాత్రమే హైలైట్ చేశారని చెప్పారు.
హైదరాబాద్ లో పేలుడు.. ఒకరు మృతి ?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్ కేంద్రంతో పాటు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏనాడూ గళం విప్పలేదని ఆరోపించారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం..
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 70-80 మందికి పైగా సభ్యులు ఉన్నారని తెలిపారు. అయినా ఈ అంశాన్ని లేవనెత్తకుండా కాంగ్రెస్ పార్టీ తప్పించుకుందని చెప్పారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఏకైక ఒకే ఒక బీఆర్ఎస్ నాయకుడు కేంద్రాన్ని ప్రశ్నించారని గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో విఫలమైన కేంద్రాన్ని ప్రశ్నించలేదని తెలిపారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని, కానీ ఏనాడూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ విషయంలో కేంద్రంపై పోరాటం చేయలేదని ఆరోపించారు.