రేవంత్ రెడ్డి దూకుడు.. తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

Siva Kodati |  
Published : Dec 17, 2023, 08:20 PM ISTUpdated : Dec 17, 2023, 08:50 PM IST
రేవంత్ రెడ్డి దూకుడు.. తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

సారాంశం

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దూకుడు పెంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన కీలక అధికారులను బదిలీ చేస్తూ కొత్త వారికి ఆ పోస్టులు కట్టబెడుతోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం 9 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.   

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దూకుడు పెంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన కీలక అధికారులను బదిలీ చేస్తూ కొత్త వారికి ఆ పోస్టులు కట్టబెడుతోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం 9 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వున్న నితిక పంత్, సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలను కూడా బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు :

  • హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్
  • హైదరాబాద్ క్రైమ్ చీఫ్‌గా ఏవీ రంగనాథ్
  • వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్
  • డీసీపీ డీడీగా శ్వేత
  • హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా జోయల్ డెవిస్
  • హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడు
  • నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా