ఏయ్.. ఓయ్.. నేను టిఆర్ఎస్ లీడర్ ను.. హూం.. ఏం...?

Published : Nov 03, 2017, 05:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఏయ్.. ఓయ్.. నేను టిఆర్ఎస్ లీడర్ ను.. హూం.. ఏం...?

సారాంశం

తాగి బండి తోలి అడ్డంగా బుక్ అయిన వరంగల్ టిఆర్ఎస్ లీడర్ కేసు నమోదు చేసిన వరంగల్ పోలీసులు హోంమంత్రితోటి చెప్పిస్త అని బెదిరిస్తే డోంట్ ఖేర్ అన్న పోలీసులు

వరంగల్ నగరంలో ఒక టిఆర్ఎస్ నాయకుడు రాత్రి పూట మందుకొట్టి బండి తోలిండు (కారు నడిపిండు). దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన సందర్భంలో సదరు అధికార పార్టీ లీడర్ దొరికిపోయిండు. అయితే తాను తాగలేదు.. నన్ను వదిలిపెట్టురి అని పోలీసుల మీదికి  ఫైర్ అయిండు. అయినా వదలకుండా పట్టుపట్టి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పెట్టి చూస్తే సార్ మస్త్ మందుకొట్టిండని తేలిపోయింది. దీంతో పోలీసులు కేసు పెట్టారు. 


దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ నగరంలో కాజీపేట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మందు తాగి కారు తోలుతూ మోతిలాల్ అనే టిఆర్ఎస్ నాయకుడు పోలీసులకు దొరికిండు.  పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయబోతే... హేయ్.. ఓయ్ అంటూ కేకలేసిండు. నేను కార్పొరేటర్ ను... నాకు హోంమంత్రి జిగ్రి దోస్త్.. నన్ను పట్టుకుంటరా? ఏమనుకుంటున్నరు నా తడాఖా ఏందో చూపించమంటరా? అని చిందులేసిండు. మోతీలాల్ తీర్గనే ఆయన అనుచరులు కూడా పోలీసుల మీదికి ఉరికిర్రు. గడ్ బడ్ చేసిర్రు.

అయినా పోలీసులు వెనకకు తగ్గలేదు. మోతీలాల్ కు పరీక్షించారు. ఆయనకు 72 శాతం మద్యం తాగినట్లు రికార్డు అయింది. దీంతో తాగి వాహనం నడిపిన కేసు, వేగంగా వాహనం నడిపిన కేసులు బనాయించిర్రు వరంగల్ పోలీసులు.

 

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

https://goo.gl/NY4JPG

PREV
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?