తెలంగాణలో కేటిఆరే నెంబర్ 1

First Published Nov 3, 2017, 2:55 PM IST
Highlights
  • తెలంగాణ పొలిటికల్ టెండూల్కర్ కేటిఆర్
  • కేటిఆర్ దరిదాపుల్లో కూడా లేని లీడర్లు
  • తండ్రి కేసిఆర్ కంటే కేటిఆర్ మూడు రెట్లు ఎక్కువ
  • రెండో స్థానంలో కేసిఆర్, మూడో స్థానంలో కవిత
  • నాలుగో స్థానానికి ఎగబాకిన రేవంత్ రెడ్డి
  • హిమాన్ష్ కు సైతం మంచి ర్యాంక్

ఇదేంటబ్బా? ఈ లెక్కలేంది ? ఈ కథేంది అనుకుంటున్నరా? ఎక్కడన్నా పోటీలు జరిగి వీళ్లకు ర్యాంకులిచ్చిర్రా ఏంది అనుకుంటున్నరా? కేటిఆరే ఎందుకు నెంబర్ వన్ అయిండు అని డౌటొస్తుందా? తండ్రి కేసిఆర్ ను కేటిఆర్ మించిపోవుడేంది అని అనుమానమొస్తుందా? అయితే ఈ స్టోరీ చదివితే కానీ మీకు అర్థం కాదు.

గూగుల్ తల్లి మనందరికి తెలుసు కదా? ఈరోజుల్లో ఏది కావాలన్నా మనం టక్కున అడిగేది గూగుల్ తల్లినే. అన్ని మంచి చెడ్డలకు గూగల్ తల్లినే నమ్ముకుంటున్న రోజులివి. అయితే గూగల్ సెర్చ్ లో ఒకసారి తెలంగాణ రాజకీయ నాయకుల పేర్లను టైప్ చేస్తే ఎన్ని సెర్చ్ రిజల్ట్స్ వస్తాయా అని ప్రయత్నం చేసింది ఏషియా నెట్ (దీన్ని సరదగానే తీసుకోవాలి.) ఇంకేముంది ఆ వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 నిమిషాల ప్రాంతంలో పలువురు తెలంగాణ రాజకీయ నాయకుల పేర్లతో గూగుల్ సెర్చ్ లో వచ్చిన డాటా వివరాలు ఈ కింద ఉన్నాయి. స్క్రీన్ షాట్స్ కూడా కింద చూడొచ్చు.

అయితే ఈ గూగుల్ సెర్చ్ లో తెలంగాణలోనే నెంబర్ 1 స్థానంలో కేటిఆర్ 3,30,00,000 తో నిలిచారు. ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. క్రికెట్ లో టెండూల్కర్ ఎంతటి స్థాయిలో ఉన్నాడో తెలంగాణ రాజకీయ నాయకుల గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో కేటిఆర్ అంత ఎత్తులో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో సిఎం కేసిఆర్ 1,21,00,000 తో నిలిచారు. అయితే రెండో స్థానంలో ఉన్న కేసిఆర్ కంటే సుమారు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాడు కేటిఆర్. ఇక మూడో స్థానంలో కేసిఆర్ తనయ కవిత 91,10,000 తో ఉన్నారు. అయితే కేటిఆర్ మూడు కోట్ల మార్కును దాటితే కేసిఆర్ కోటి మార్కు దాటారు. కవిత మాత్రం కోటికి దగ్గర్లో ఉన్నారు.

ఇక ఇటీవల కాలంలో తెలుగు రాజకీయాల్లో సంచనాలకు కేంద్ర బిందువైన రేవంత్ రెడ్డి నాలుగో స్థానానికి ఎగబాకారు. 29,20,000 తో ఆయన నిలిచారు. ఆయితే మూడో స్థానంలో ఉన్న కవితకు రేవంత్ రెడ్డికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. మిగిలిన స్థానాల్లో వరుసగా జానారెడ్డి, గీతారెడ్డి, హరీష్ రావు, డికె.అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలిచారు. ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష కు అటూ ఇటుగా నిలిచారు.

అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే కేటిఆర్ తనయుడు హిమాన్ష్ రావు పేరుతో ఉన్న గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. హిమాన్ష్ పేరుతో 4,31,000 సెర్చ్ రిజల్ట్స్ లభించాయి. మంత్రి హరీష్ రావు కంటే హిమాన్ష్ పేరిట వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఈ సంఖ్య ప్రతి క్షణం అటూ ఇటూగా మారే పరిస్థితి ఉంటుంది. ఆ క్షణంలో అలా ఉంది. రానున్న రోజుల్లో మార్పు జరిగే చాన్స్ ఉంటుంది.

 

 ఇవీ గూగుల్ చెప్పిన లెక్కలు... నవంబరు 3వ తేదీ, మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో తీసినవి. అందరి లెక్కలు కింద ఇచ్చాము. చూడొచ్చు.

కేటిఆర్ = 3,30,00,000

 

కేసిఆర్  1,21,00000

 

కవిత = 93,10,000

 

రేవంత్  29,20,000

 

జానారెడ్డి 5,46000

 

గీతారెడ్డి = 5,21,000

 

హరీష్ రావు = 4,17,000

 

డికె అరుణ = 4,04,000

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి 3,12,000



ఎర్రబెల్లి దయాకర్ రావు = 1,38,000

 

హిమాన్ష్ రావు= 4,31,000

 

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

click me!