ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేసి.. కుటుంబం నిరసన.. ‘కేటీఆర్ సారు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం’

By telugu teamFirst Published Nov 24, 2021, 3:30 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఓ బాధిత కుటుంబం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బా పట్టుకుని నిరసన చేస్తున్నది. పద్మనగర్‌కు చెందిన సంతోష్ కుటుంబం ఇక్కడ నిరసనకు కూర్చున్నది. స్థానిక నేతల సూచనలతోనే పద్మనగర్‌లో స్థలం కొన్నారని, తీరా అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కూల్చేశారని, మరో చోట ప్లాట్ ఇస్తామని చెప్పి ఏడాది దాటినా.. ఇంకా ఇవ్వడం లేదని.. తమకు న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్ గారిని కోరారు.
 

హైదరాబాద్: MPDO కార్యాలయానికి తాళం వేసి(locked).. ఓ కుటుంబం Petrol డబ్బా పట్టుకుని నిరసన చేస్తున్నది. అధికారులను సైతం కార్యాలయంలోకి రానివ్వడం లేదు. తమకు న్యాయం చేయకపోతే ఇదే కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన చెందుతున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకున్నది. స్థానిక టీఆర్ఎస్ నేతలు తమ కుటుంబాన్ని మోసం చేసిందని బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తున్నది. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను పేర్కొంటూ నిరసనకు దిగింది. 

తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన సంతోష్ కుటుంబం ఈ నిరసన చేస్తున్నది. కొందరు టీఆర్ఎస్ నేతలు తమకు గ్రామంలో స్థలం అమ్మారని, తాను ఆ స్థలాన్ని ఏడాదిన్నర క్రితం కొనుగోలు చేశానని సంతోష్ అన్నారు. ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని గ్రామ పంచాయతీకి దరఖాస్తు పెట్టుకున్నాని తెలిపారు. కానీ, దానిపై తనకు అనుమతులు రాలేవని, ఎంతో మంది అధికారులనూ కలిసి వేడుకున్నా తనకు అనుమతులు ఇవ్వలేదని వివరించారు. కాలయాపన చేశారని, రేపిస్తాం.. మాపిస్తాం.. అంటూ తనను తింపారని పేర్కొన్నారు.

Also Read: Telangana Unemployment: మంత్రి కేటీఆర్ ఇలాకాలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

అయితే, తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారం, నెల రోజుల లోపు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుంటే అట్టి నిర్మాణానికి అనుమతులు ఉన్నట్టుగానే పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వ జీవోనే చెబుతున్నదని, అందుకే తాను ఇంటి నిర్మాణం మొదలు పెట్టారని సంతోష్ అన్నారు. కానీ, తీరా ఇంటి నిర్మాణం పూర్తయ్యాక స్థానికంగా ఉండే కొందరు టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు తన ఇంటిని కూల్చడానికి వచ్చారని ఆరోపణలు చేశారు. సుమారు మూడు రోజుల తర్వాత తంగళ్లపల్లి సర్పంచ్ ఇంటికి తనను పిలిపించి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఆ తర్వాత తన ఇంటిని కూల్చేశారని తెలిపారు.

Also Read: trs dharna...రైతు తిరగబడితే ఎడ్లబండి కింద మీ పార్టీ నలిగిపోతుంది: బీజేపీకి కేటీఆర్ వార్నింగ్

ఆ స్థలం కొనడం సరికాదని, ఆ స్థలానికి బదులు మరో చోట ప్లాట్ ఇస్తామని తమకు సుమారు 13 మంది సర్పంచ్‌ల సమక్షంలో హామీ ఇచ్చారని తెలిపారు. స్థలానికి బదులు స్థలం.. ఇల్లు కట్టుకోవడానికీ డబ్బులూ ఇస్తామని చెప్పినట్టు వివరించరారు. కానీ, ఇప్పటికి ఏడాదిన్నర గడిచినప్పటికీ తమ కుటుంబానికి న్యాయం జరగలేదని సంతోష్ అన్నారు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని తెలిపారు. అందుకే తాము ఎంపీడీవో కార్యాలయంలోనే నిరసన చేస్తున్నామని, తమకు న్యాయం జరిగే వరకు తమ కొడుకు సహా ఇక్కడే నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. ‘అయ్యా కేటీఆర్ గారు.. మాకు న్యాయం చేయండి’ వేడుకున్నారు. ‘కేటీఆర్ గారు.. మీ నేతలు ఇక్కడ మీ పేరు పాడు చేస్తున్నారు’ అంటూ సంతోష్ అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుందని తెలిపారు.

click me!