Telangana Local body Mlc elections: రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

Published : Nov 24, 2021, 03:29 PM ISTUpdated : Nov 24, 2021, 04:47 PM IST
Telangana Local body Mlc elections: రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రేపు ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఈ రెండు స్థానాలతో పాటు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. దీంతో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే  అధికారులు అధికారికంగా  ప్రకటించాల్సి ఉంది.

Telangana Local body Mlc elections:లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని  శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి లు రెండు స్థానాల నుండి టీఆర్ఎస్ అభ్యర్ధులుగా బరిలోకి దిగారు. అయితే రంగారెడ్డి జిల్లాలోని  రెండు స్థానాల్లో ముగ్గురు బరిలో ఉన్నారు. అయితే ఇవాళ స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ ను తిరస్కరణకు గురైంది. రంగారెడ్డి జిల్లాలో ప్రపోజల్స్ లేకుండా దాఖలైన ఇండిపెండెంట్ నామినేషన్ ను తిరస్కరించినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నిజామాబాద్ లో  దాఖలైన ఇండిపెండెంట్ అభ్యర్ధి నామినేషన్ లో బ్యాంకు వివరాలు ఇవ్వలేదు. దీంతో ఈ నామినేషన్ ను తిరస్కరించినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో  పోటీలో టీఆర్ఎస్ అభ్యర్ధులు  ఇద్దరు మాత్రమే నిలిచారు.  దీంతో trs  అభ్యర్ధులు శంభీపూర్ రాజు,  పట్నం మహేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది.  రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.ఈ గడువు తర్వాత అధికారులు ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

also read:నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా : స్వతంత్ర అభ్యర్ధికి షాక్.. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది. ఖమ్మం, మెదక్ జిల్లాలో  రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్దులకు కాంగ్రెస్  పార్టీ బీ ఫారాలు అందించింది. ఖమ్మం లో రాయల్ నాగేశ్వర్ రావు, మెదక్ లో జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లను తమ అభ్యర్ధులకు పడేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపింది. 

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఎంపీటీసీ సంఘం పిర్యాదు

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల సమయంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో తన నామినేషన్ ను చించివేశారని  ఎంపీటీసీల సంఘం నేత శైలజ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు తాను నామినేషన్ దాఖలు చేసేందుకు రంగారెడ్డి కలెక్టర్  కార్యాలయానికి వెళ్లిన సమయంలో తన నామినేషన్ పత్రాలను చించివేశారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్