తాళి,మెట్టెలు తీసేస్తేనే పరీక్షహాల్లోకి...టీఎస్‌పిఎస్సి ఛైర్మన్ కు వీహె‌చ్‌పి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 9:08 PM IST
Highlights

గత ఆదివారం జరిగిన వీఆర్వో పరీక్షలో మెదక్ జిల్లాలో ఓ పరీక్ష కేంద్రం నిర్వహకుల అత్యుత్సాహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. పరీక్ష రాయడానికి వచ్చిన వివాహిత మహిళా అభ్యర్థుల చేత తాళి బొట్టు, కాలి మెట్టెలు తీయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లోని పరీక్ష కేంద్రంలో జరిగింది.
 

గత ఆదివారం జరిగిన వీఆర్వో పరీక్షలో మెదక్ జిల్లాలో ఓ పరీక్ష కేంద్రం నిర్వహకుల అత్యుత్సాహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. పరీక్ష రాయడానికి వచ్చిన వివాహిత మహిళా అభ్యర్థుల చేత తాళి బొట్టు, కాలి మెట్టెలు తీయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లోని పరీక్ష కేంద్రంలో జరిగింది.

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్‌వో పోస్టుల భర్తీ కోసం ఆదివారం అభ్యర్థులకు రాత పరీక్ష  జరిగింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని లిటిల్ ప్లవర్ పరీక్షా కేంద్రంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థులపై అర్థం లేని ఆంక్షలు పెడుతున్నారు. వివాహితలైన మహిళా అభ్యర్థులను పుస్తెలు, మెట్టెలు తీస్తేనే పరీక్షకు అనుమతిస్తామని లేదంటే పంపమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో  గత్యంతరం లేక మహిళా అభ్యర్థులు తమ పుస్తెలు, మెట్టెలు తీసేసి పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు.

ఈ ఘటనపై వీహెచ్‌పి లీడర్లు టీఎస్‌పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణికి ఫిర్యాదు చేశారు. హిందూ మహిళలు పవిత్రంగా భావించే పుస్తెలు, మెట్టెలు తీయించి మొత్తం హిందూ మతాన్ని అవమానించారని పేర్కొన్నారు. ఇలా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సదరు పరీక్ష కేంద్రంపై, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ను కోరారు.

దీనిపై స్పందించిన టీఎస్‌పిఎస్సి చైర్మన్ చక్రపాణి... తెలంగాణ చీఫ్ సెక్రటరీతో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్ ను విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు. ఇలా తాళిబొట్టు, మెట్టెలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించమనే నిబంధనలేవీ తాము విధించలేదని చక్రపాణి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

తాళి,మెట్టెలు తీసేసి పరీక్షకు భార్యలు.. భర్తల నిరసన

పుస్తెలు, మెట్టెలు తీయాల్సిందే... వీఆర్వో పరీక్షా కేంద్రాల్లో అధికారుల ఓవర్ యాక్షన్

ఒక్కో పోస్టుకు 1512 మంది పోటీ, 40 లక్షల మంది ఇలా...

click me!