
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఐటీ మినిస్టర్ కేటీఆర్ పై సంచలన వాక్యాలు చేశారు. వీహెచ్ నేడు నేరేళ్ల పోలీసు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోలీసుల అరాచకత్వాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని ప్రజలు సమస్యలతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ కుటుంబాలకు కారణం అయిన ఎస్పీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలన్నారు.
అంతేకాదు రాష్ట్రంలో ఒక కుటుంబం కోసమే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హాయాంలో అవినీతి జరిగినట్లు కేటీఆర్ తనకి నచ్చినట్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, కేటీఆర్ నువోక బచ్చావి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగితే మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.