రెండోసారి ఢిల్లీని జయించిన కెసిఆర్

Published : Jul 27, 2017, 12:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రెండోసారి ఢిల్లీని జయించిన కెసిఆర్

సారాంశం

మరోసారి ఢిల్లీపై కెసిఆర్ జయకేతనం నాడు తెలంగాణ సాధన, నేడు కేంద్రంలో భాగస్వామి మోడీ మనసు గెలిచేందుకు మూడేళ్లు పట్టింది బిజెపికి సౌత్ లో నమ్మకమైన మిత్రుడిగా అవతరణ ‘అక్కడ జగన్, ఇక్కడ నేను’ సాధన దిశగా అడుగులు

తెలంగాణ సిఎం కెసిఆర్ తన రాజకీయ ప్రస్తానంలో మరో మైలురాయి అధిగమించిండు. కేవలం ఇద్దరు ఎంపిలున్న వేళ తన వ్యూహ చతురతతో ఢిల్లీని జయించి తెలంగాణ సాధించిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన మూడేళ్ల తర్వాత మరోసారి తన మంత్రాంగంతో ఢిల్లీలో విజయ పతాక ఎగురవేసిండు. కేంద్రంలో భాగస్వామిగా కొత్త రూపు సంతరించుకోనున్నారు గులాబీ నేత. దీంతో తన చిరకాల వాంఛ అయిన ‘అక్కడ జగన్, ఇక్కడ నేను’ అనేమాటను నెరవేర్చుకునే దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.  ఇద్దరం కలిసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం అన్నమాటలను నిజం చేసుకోబోతున్నారు. ఈ టర్మ్ లో మిగిలిపోయిన రెండేళ్లపాటు కెసిఆర్ కు ఇటు తెలంగాణలో అటు జాతీయ స్థాయిలో తిరుగే లేదన్న చర్చ వినిపిస్తోంది.

రాజకీయాలకు రాజకీయాలు నేర్పే ఉద్ధండుడు తెలంగాణ సిఎం కెసిఆర్. సమకాలీన భాతర రాజకీయాల్లో కెసిఆర్ ను మించిన వ్యూహకర్తలు లేరనే  చెప్పాలి. నాడు ఇద్దరు ఎంపిలు కలిగిన ఒక ప్రాంతీయ పార్టీ భారత ప్రభుత్వం మెడలు ఒంచి రాష్ట్రాన్ని సాధించిందంటే అది కేసిఆర్ వ్యూహ చతురత తప్ప మరొకటి కాదు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త ఆలస్యమైనా మరోసారి ఢిల్లీ కోటపై కెసిఆర్ జైత్రయాత్ర సాగిస్తున్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ సిఎం కెసిఆర్ అందివచ్చిన వరాలుగా మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఎ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో బిజెపి అధిష్టానానికి వ్యూహాత్మకంగా దగ్గరయ్యారు కెసిఆర్. ఢిల్లీలో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రులను కలిసి తాము ఎంతగా భేషరతుగా మద్దతిస్తున్నమో తెలియజెప్పారు. దీంతో బిజెపి నాయకత్వానికి దక్షిణాదిలో ఒక నమ్మకమైన స్నేహితుడు దొరికిండని సంబరపడే స్థితికి వచ్చేలా చేశారు కెసిఆర్.

ఇక కెసిఆర్ స్నేహ హస్తంతో బిజెపి మరో స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఎన్డీఎ భాగస్వామ్య పక్షంగా ఉన్న దక్షిణాది స్నేహితుడిగా కొనసాగుతున్న ఎపి సిఎం చంద్రబాబును బిజెపి దూరం చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకదశలో తెలంగాణ సిఎం కు ప్రధాని అపాయింట్ మెంట్ దొరికింది కానీ ఎన్డీఎ భాగస్వామి అయిన చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దొరకలేదంటే కెసిఆర్ ఎలా బిజెపి పెద్దలను బుట్టలో వేసుకున్నరో అని ఒక టిడిపి నాయకుడు అన్నారు.

ఉత్తరాదిలో నమ్మకమైన మిత్రుడుగా నితీష్ దొరికాడు బిజెపికి. ఇటు దక్షిణాదిలో కెసిఆర్ తో పాటు మరో మిత్రుడు కూడా దొరికినట్లయింది. ఎపిలో అవసరమైతే జగన్ తో బిజెపి దోస్తాన్ చేయొచ్చని అంటున్నారు. దీంతో కెసిఆర్ గతంలో ఏదైతే మాట చెప్పిండో అది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే 2014లో అవుతుందన్నాడు. అది 2019లో అమలు జరిగే చాన్స్ ఉందంటున్నారు. ఎపిలో జగన్, ఇక్కడ మేము అన్న కెసిఆర్ మాట 2019లో అమలవుతుందేమో అన్న వాతావరణం రాజకీయాల్లో ఉంది.

మరి ఢిల్లీ సంబంధాలను కెసిఆర్ తెలంగాణ అభివృద్ధికి ఏమేరకు వినియోగిస్తారన్నది ఆచరణలో తేలే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్