గురుకుల నోటిఫికేషన్లు రద్దు కాలేదు : టిఎస్ పిఎస్సీ ప్రకటన

First Published Jul 26, 2017, 10:18 PM IST
Highlights
  • గురుకుల నోటిఫికేషన్లు రద్దు కాలేదు
  • వదంతులు నమ్మొద్దు
  • హైకోర్టులో కేసు ఉండగా రద్దు జరగదు
  • కోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటాం
  • టిఎస్ పిఎస్సీ ప్రకటన

గురుకుల నోటిఫికేషన్లు రద్దు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టిఎస్ పిఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. ఇలాంటి పుకార్లను అభ్యర్థులు నమ్మకూడదని తెలిపారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఏకపక్షంగా గురుకుల నోటిఫికేషన్ రద్దు చేయడం సాధ్యమయ్యే పనికాదన్నారు. కేవలం కోర్టు మధ్యంతర ఉత్వర్వులను అనుసరించి గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు మాత్రమే వాయిదా వేశామని ఆమె గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి గురుకుల నోటిఫికేషన్ల పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు తొందరపడి  ఎలాంటి అవగాహనకు రావొద్దన్నారు.

తెలంగాణ గురుకుల నోటిఫికేషన్లను రద్దు చేసినట్లు బుధవారం మధ్యాహ్నం వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేసింది. దీంతో నిరుద్యోగులైన అభ్యర్థులు గందరోగోళానికి గురయ్యారు. పెద్ద ఎత్తున ఫేస్ బుక్, వాట్సాప్ లో చర్చలు నడిచాయి. ఈ విషయమై పబ్లిక్ సర్వీసు కమిషన్ పాలక మండలికి కూడా ఫోన్లు, మెసేజ్ లు వెళ్లాయి. దీంతో నిరుద్యోగుల ఆందోళనను గుర్తించిన కమిషన్ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ల రద్దు వార్తలు పట్టించుకోరాదని ప్రకటించింది. దీంతో అభ్యర్థులకు క్లారిటీ వచ్చినట్లైంది.

click me!