హైద్రాబాద్ బాలాపూర్‌లో యువకుడి హత్య : తల, మొండం వేరు చేసిన నిందితుడు

By narsimha lode  |  First Published Feb 26, 2023, 10:44 AM IST

హైద్రాబాద్  బాలాపూర్ పరిధిలో  ఫైజల్ అనే యువకుడిని  జబ్బార్ అనే వ్యక్తి  హత్య  చేశాడు.


హైదరాబాద్: నగరంలోని  బాలాపూర్ లో  ఫైజల్  అనే  యువకుడిని  జబ్బార్ అనే వ్యక్తి కిడ్నాప్  చేసి  హత్య  చేశారు.  ఫైజల్  తల,  మొండెం వేరు చేశాడు. తల  ఇంకా లభ్యం కాలేదు. తల  కోసం  పోలీసులు గాలిస్తున్నారు.  

మృతదేహంపై  ఉన్న ఉన్న దుస్తుల ఆధారంగా  ఫైజల్ గా  గుర్తించారు.  ఫైజల్ ఈ నెల  12వ తేదీన  ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఉస్మానియా హోటల్  వద్దకు వెళ్లి వస్తానని  ఇంటి నుండి   ఫైజల్  వెళ్లినట్టుగా  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ అతను తిరిగి రాలేదు. 

Latest Videos

 దీంతో  కుటుుంబసభ్యులు  ఈ నెల  13వ తేదీన పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  ఫైజల్  కోసం  గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే  నిన్న రాత్రి  ఫైజల్  మృతదేహం  బాలాపూర్   పోలీస్ స్టేషన్ పరిధిలో  లభ్యమైంది.  

మృతుడు ఫైజల్  కు ఆరు మాసాల క్రితమే వివాహమైంది.  ఆయన  భార్య ప్రస్తుతం గర్భవతి.  ఫైజల్  ను   ఈ నెల  12వ తేదీనే జబ్బార్ కిడ్నాప్  చేసి  హత్య చేసి  ఉంటారని  పోలీసులు అునుమానిస్తున్నారు.ఫైజల్ ను జబ్బార్ ఎందకు  హత్య   చేసి ఉంటారనే  విషయమై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  జబ్బార్ కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

click me!