చదవాలంటే భయమేస్తుంది: సైఫ్ వేధింపులపై వెలుగులోకి మెడికో ప్రీతి ఆడియో సంభాషణ

By narsimha lodeFirst Published Feb 26, 2023, 10:17 AM IST
Highlights


మెడికో  ప్రీతి  తనపై  జరుగుతున్న  వేధింపుల విషయమై  తల్లికి వివరించింది.  ఈ విషయమై  ప్రీతికి ధైర్యం  చెప్పింది  తల్లి. 
 

వరంగల్:  తనపై  జరుగుతున్న వేధింపుల గురించి  మెడికో ప్రీతి  తన తల్లికి  చెప్పుకుంది. ఈ విషయమై  ఆడియో సంభాషణ  వెలుగు చూసింది.  సీనియర్ సైఫ్ సహ  అతని బ్యాచ్  తన విషయంలో  అనుసరిస్తున్న   విధానాలపై  ప్రీతి  తన తల్లితో  చెప్పుకుని  బాధపడింది.  తాను  ఏ రకంగా  ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తల్లికి తెలిపింది. సైఫ్  ఏం చేయలేడని  ప్రీతికి  తల్లి  ధైర్యం చెప్పింది.  

చదువుపై దృష్టి పెట్టాలని  ప్రీతిని తల్లి  కోరింది.  ఇప్పటికే  సైఫ్ పై  ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రీతికి  తల్లి  వివరించింది. అయితే   ఈ విషయాలపై  నాన్న  ప్రిన్సిపల్  సహ ఇతరులకు  ఫిర్యాదు  చేసినట్టుగా  తల్లి  ఆమెకు తెలిపింది.  ఈ విషయమై  హెచ్ఓడీ  కూడా తనను పిలిపించి మాట్లాడారని  కూడా  ప్రీతి తల్లికి చెప్పింది.   చదువుపై  దృష్టి పెట్టాలని ప్రీతికి తల్లి   సూచించింది. 

ఈ నెల  22వ తేదీన  కేఎంసీ  మెడికల్ కాలేజీలో  మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసింది.  ఆమెకు  వరంగల్ ఎంజీఎం  ఆసుపత్రిలో  చికిత్స అందించారు. అప్పటికే ఆమె  పరిస్థితి  విషమంగా  మారడంతో  హైద్రాబాద్  నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.  హైద్రాబాద్  నిమ్స్ ఆసుపత్రిలో  మెడికో  ప్రీతికి  వైద్యులు  చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ  మెడికో  ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉంది. 

సీనియర్ సైఫ్  వేధింపుల కారణంగానే  మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించినట్టుగా  వరంగల్ సీపీ  రంగనాథ్  రెండు  రోజుల క్రితం  ప్రకటించారు. ఈ కేసులో  సైఫ్ ను అరెస్ట్  చేసి రిమాండ్  కు తరలించారు. 

ఈ  విషయమై   ప్రోఫెసర్ల బృందం ప్రభుత్వానికి నివేదిక పంపింది.  మరో వైపు  సైఫ్ పై  సస్పెన్షన్ వేటు పడింది.  ఈ కేసులో  అతని ప్రమేయం  ఉందని తేలితే  సైఫ్ పై బహిష్కరణ వేటు తప్పకపోవచ్చు. 

మెడికో  ప్రీతి  పేరేంట్స్  కూడా  ఈ విషయమై  కేఎంసీ  ప్రిన్సిపల్ కు  ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  సైఫ్ , మెడికో ప్రీతికి కౌన్సిలింగ్  ఇచ్చారు. వీరిద్దరికి  కౌన్సిలింగ్  ఇచ్చిన రెండు రోజుల తర్వాతే  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుంది. 

click me!