తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల (Telangana Airports) స్టేటస్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో వెల్లండించింది. అలాగే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ (Hyderabad Airport) విస్తరణపై కూడా వివరాలను తెలిపింది.
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల (Telangana Airports) స్టేటస్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో వెల్లండించింది. అలాగే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ (Hyderabad Airport) విస్తరణపై కూడా వివరాలను వెల్లడించింది. రాజ్యసభలో టీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి (TRS MP KR Suresh Reddy) అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. కొత్త ఎయిర్‌పోర్టులకు సంబంధించి సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి వీకే సింగ్ (union minister vk singh).. తెలంగాణలో 6 కొత్త ఎయిర్‌పోర్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మూడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను, అదే విధంగా వరంగల్ జిల్లా మామ్నూర్, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ప్రతిపాదించిందని చెప్పారు.
undefined
‘మొత్తం ఆరు ప్రతిపాదిత విమానాశ్రయాలలో టెక్నో-ఫీజిబిలిటీ అధ్యయనాలు నిర్వహించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)ని నియమించింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల స్టడీని పూర్తిచేసి నిదికను తెలంగాణ ప్రభుత్వానికి అందించింది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తి కావడం అనేది భూ సేకరణ, అనుమతుల లభ్యత, ఆర్థిక పరమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
Also read: TRS MPs protest: తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతోందన్న టీఆర్‌ఎస్ ఎంపీలు.. పార్లమెంట్‌లో నిరసన
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణపై..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై కేఆర్ సురేష్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి.. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తవుతుందని తెలిపారు. విస్తరణ పూర్తయ్యాక విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 1.2 కోట్ల స్థాయి నుంచి 3.4 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.