కాంగ్రెస్, బీజేపీలకు ఆ నైతిక హక్కు లేదు.. నారాయణ ఖేడ్ లో మంత్రి హరీష్ రావు (వీడియో)

By AN TeluguFirst Published Nov 30, 2021, 2:20 PM IST
Highlights

వడ్ల కొనుగోలు విషయం లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర  రాద్ధాంతం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో Purchasing Centers ఎన్ని, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్ని? అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో  70 శాతం పంట కొనుగోలు పూర్తి  చేశాం అన్నారు. ఇంకా 30 శాతం కొనుగోలు చేయాల్సి  ఉందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా : తెలంగాణ మంత్రి  harish rao మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా narayankhed ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. అక్కడి  సిబ్బంది వివరాలపై ఆరాతీశారు. దవాఖానలో రోగులతో మాట్లాడారు. వారికి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో కనుక్కున్నారు. వైద్య సేవలపై కూడా ఆరా తీశారు.

"

రక్త నిధి, ఆక్సిజన్ ప్లాంట్, ఎక్స్ రే విభాగాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇందుకోసమే అన్ని సదుపాయాలు కల్పించామని వారిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 
వడ్ల కొనుగోలు విషయం లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర  రాద్ధాంతం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో Purchasing Centers ఎన్ని, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్ని? అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో  70 శాతం పంట కొనుగోలు పూర్తి  చేశాం అన్నారు. ఇంకా 30 శాతం కొనుగోలు చేయాల్సి  ఉందని తెలిపారు.

ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోళ్లు కేంద్రలు ప్రారంభించామన్నారు. బీజేపీ కి, కాంగ్రెస్ కు కొనుగోలు పై మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేారు. 

Piyush Goyal‌ వైఖరి ఒకలా, కేంద్ర మంత్రి Kishan Reddy  మాటలు మరోలా ఉంటున్నాయన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో  కేంద్రం ఒక లెటర్ ఇవ్వాలన్నారు. కేంద్రం తీరుతో తడిసిన వడ్లు కొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడని కొనియాడారు. 
 
నారాయణఖేడ్‌కు తాగు, సాగు నీరు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 70 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ త్రాగునీరు  సాగు నీరు అందించలేదన్నారు. రైతు బంధు క్రింద నారాయణఖేడ్ కు  200 కోట్లు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇస్తుందని.. రైతులను పాటించుకొని ప్రభుత్వలు కాంగ్రెస్ , బీజేపీ లేనని అన్నారు.                 

సింగూర్ ప్రాజెక్టు ద్వారా  లిఫ్ట్ పెట్టి సంగారెడ్డి జిల్లాకు  నీరు అందిస్తామన్నారు. 4 వేల నాల్గవ  వందల కోట్ల తో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల  పథకాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

click me!