తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని.. భార్యను ఉరేసి చంపి.. ఫ్యాన్ కు వేలాడదీసిన భర్త..

By AN TeluguFirst Published Nov 30, 2021, 1:35 PM IST
Highlights

ఐదు రోజుల క్రితం  భార్య కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ రావడాన్ని గమనించిన నరసింహ అప్పటినుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు.  ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు.  సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి  మరోసారి  గొడవకు దిగాడు.  కోపోద్రిక్తుడై  క్షణికావేశంలో  విద్యుత్ వైర్ తో  లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు.

రంగారెడ్డి జిల్లా :  కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను ఉరేసి చంపాడు. ఆ తర్వాత suicideగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన మహేశ్వరం మండలం పరిధిలోని మాణిక్యమ్మ గూడలో సోమవారం చోటు చేసుకుంది.  పోలీసుల  కథనం ప్రకారం..  కందుకూరు మండలం  చిప్పలపల్లికి  చెందిన  అల్వాల  నరసింహకు మహేశ్వరం మండలం  మాణిక్యమ్మ గూడ కు చెందిన  లక్ష్మమ్మ అలియాస్ మంగమ్మ (30)  తో 2005 లో వివాహం అయ్యింది. 

పెళ్లి అయిన కొన్ని రోజులకే నరసింహ అత్తగారి ఊరికి మకాం మార్చాడు.  అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. నరసింహ మేస్త్రి,  డ్రిల్లింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  5 రోజుల క్రితం  భార్య కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి phone call రావడాన్ని గమనించిన నరసింహ అప్పటినుంచి ఆమెపై suspicious పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు.

ఆదివారం రాత్రి  liquor తాగి ఇంటికి వచ్చాడు.  ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు.  సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి  మరోసారి  గొడవకు దిగాడు.  కోపోద్రిక్తుడై  క్షణికావేశంలో  విద్యుత్ వైర్ తో  లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి murder చేశాడు.

 ఆ తరువాత ఫ్యాన్కు ఉరేసుకుని లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు.  ఏమి ఎరగనట్లు చుట్టుపక్కల వారికి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాడు.  మృతురాలి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు తమదైన శైలిలో భర్తను విచారించారు.  దీంతో తానే హత్య చేసినట్లు నరసింహ నేరం అంగీకరించాడు.  మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు.

ఇదిలా ఉండగా,  సికింద్రాబాద్ తిరుమలగిరిలో కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మృతుడిని రియల్‌ఏస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.  సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ఇంటి నుండి వెళ్లిన విజయభాస్కర్ రెడ్డి తిరిగి రాలేదు. కారులోనే ఆయన శవమై తేలడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.  ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం Vijay Bhaskar Reddy నిన్న ఉదయం ఇంటి నుండి రూ. 10 లక్షలు తీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

హైద్రాబాద్‌లో కారులో మృతదేహం: రియల్‌ వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డిగా గుర్తింపు

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని police అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయమై  మధ్యవర్తులుగా వ్యవహరించిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక మరేవరైనా  ఈ ఘటనకు పాల్పడ్డారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోనే రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డిని కత్తితో పొడిచి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో మరణించిన వ్యక్తి నుండి ఆధారాలు సేకరించారు. నోరు ముక్కు వద్ద గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఆ తర్వాత హత్యగా గుర్తించారు. విజయ భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు.విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన వారిని కూడా పోలీసులు  విచారించే అవకాశం ఉంది. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

click me!